ఐపీఎల్ 2019: ప్లాప్ షో చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్ వీరే!

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సగం మ్యాచ్‌లు ముగిశాయి. పాయింట్ల పట్టికలో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా... కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో చెన్నై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు కోహ్లీసేన మాత్రం వరుస ఓటములతో అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్ ఆరంభంలో రాజస్థాన్, ఆర్సీబీ జట్లు పేలవ ప్రదర్శన చేశాయి. ఆయితే, ఆ తర్వాత రాజస్థాన్ పుంజుకున్నప్పటికీ... ఆర్సీబీ మాత్రం అదే ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఏడింట ఓటమిపాలై ప్లేఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు ముగిసిన మ్యాచ్‌ల్లో కేకేఆర్ బ్యాట్స్‌మెన్ మాత్రం అభిమానులకు అసలైన టీ20 మజాను పంచారు.
ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముగిసిన మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. రాజస్థాన్ తరుపున సంజూ శాంసన్, పంజాబ్ తరుపున కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలు సెంచరీలు సాధించారు.
అయితే, ఈ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు ప్లాప్ షో చేశారు. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన టాప్-5 ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే:

అంబటి రాయుడు - చెన్నై సూపర్ కింగ్స్
గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అంబటి రాయుడు ఈ సీజన్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన అంబటి రాయుడు కేవలం 138 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 57, యావరేజి 19.71. స్ట్రయిక్ రేట్ 86.25. ఈ సీజన్‌లో రాయుడు తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. తాజాగా సోమవారం ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో కూడా రాయుడు చోటు దక్కించుకోలేకపోయాడు.

మొయిన్ అలీ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఈ సీజన్‌లో మొయిన్ అలీ ప్రాతినిథ్యం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా ఆరు ఓటములను చవి చూసింది. ఇందుకు కారణం జట్టు సమిష్టిగా రాణించలేకపోవడమే. గత సీజన్‌లో మంచి ప్రదర్శన చేయడంతో మొయిన్ అలీని ప్రాంఛైజీ వేలానికి వదలకుండా తన వద్దే అట్టిపెట్టుకుంది. అయితే, ఈ సీజన్‌లో అలీ ఆశించిన మేరకు రాణించలేదు. ఇప్పటివరకు ఆర్సీబీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో మొయిన్ అలీకి కేవలం 7 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం మాత్రం వచ్చింది. దీంతో ఈ ఏడు మ్యాచ్‌ల్లో ఆడిన మొయిన్ అలీ 124 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 50. యావరేజి 24.80. స్ట్రయిక్ రేట్ 147.60.

మనీష్ పాండే - సన్‌రైజర్స్ హైదరాబాద్
మనీష్ పాండే... ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన మొదటి భారత ఆటగాడు. 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మనీష్ పాండే డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత పాండే పలు ప్రాంఛైజీలకు ఆడాడు. కాగా, 2018 ఐపీఎల్ వేలంలో మనీష్ పాండేని సన్‌రైజర్స్ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసింది. ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ యాజమాన్యం అత్యధికంగా వెచ్చించింది మనీష్ పాండేకే కావడం విశేషం. సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌లో లోయర్ ఆర్డర్‌లో ఆడే పాండేక్ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాలేదు. అయితే, ఆ తర్వాత పాండే ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీంతో కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి 19. స్ట్రయిర్ రేట్ 13.50.

షిమోన్ హెట్‌మెయిర్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
గతేడాది భారత పర్యటనకు వచ్చిన వెస్టిండిస్ జట్టులో అద్భుత ప్రదర్శన ఆటగాళ్లలో షిమోన్ హెట్‌మెయిర్ ఒకడు. 22 ఏళ్ల షిమోన్ హెట్‌మెయిర్ విండిస్ తరుపున 5 వన్డేలాడి 259 పరుగులు చేశాడు. ఇది చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఈ సీజన్‌లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో షిమోన్ హెట్‌మెయిర్‌ను రూ. 4.2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు షిమోన్ హెట్‌మెయిర్ చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇప్పటివరకు షిమోన్ హెట్‌మెయిర్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి 9. స్ట్రయిక్ రేట్ 57.69

యూసఫ్ పఠాన్ - సన్‌రైజర్స్ హైదరాబాద్
క్యాష్ రిచ్ టోర్నీగా పేరుగాంచిన ఐపీఎల్‌లో బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా యూసఫ్ పఠాన్‌కు పేరుంది. ఐపీఎల్ 2019 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రూ. 1.9 కోట్లకు యూసఫ్ పఠాన్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం రిటైన్ చేసుకుంది. అయితే, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అనుకు్న్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన యూసఫ్ పఠాన్‌కు కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీంతో కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి 16. స్ట్రయిర్ రేట్ 86.48.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications