Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sachin Tendulkar: విమానంలో ‘సచిన్.. సచిన్’ నినాదాలు.. ఆ రోజులు గుర్తొచ్చాయన్న లెజెండ్

Flight Passengers chang Sachin name after spotting him

'సచిన్.. సచిన్..' ఈ నినాదం రెండు దశాబ్దాలపైగా భారత క్రికెట్ లోకాన్ని ఉర్రూతలూగించింది. దీనికి కారణమైన సచిన్ టెండూల్కర్ అంటే తెలియని క్రీడాభిమాని ఉండడు అనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికీ అతని అభిమానులు సచిన్‌ను చూసిన ప్రతిసారీ ఇలాగే అరుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా జరిగిన ఘటనే దీనికి మంచి ఉదాహరణ. ఒక విమానంలో సచిన్ ప్రయాణిస్తుండగా.. దానిలో ఉన్న ప్రయాణికులు అతన్ని గమనించారు.

అంతే ఆ విమానం అంతా దద్దరిల్లేలా సచిన్ నామస్మరణ చేశారు. ఇది చూసిన సచిన్ చాలా సంతోషించినట్లు చెప్పాడు. విమానం ల్యాండయిన తర్వాత ఈ ఘటన గురించి ట్వీట్ చేసిన సచిన్.. ఆ విమానంలోని ప్రయాణికులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. 'సీట్ బెల్ట్ సైన్ ఆన్‌లో ఉండటంతో లేచి నిలబడి అందరినీ పలకరించలేదు. అందుకే ఇప్పుడు ఇలా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా' అని ట్వీట్ చేశాడు. ప్రయాణికులంతా అలా తన పేరు పిలవడం తను క్రికెట్ ఆడే రోజులను గుర్తు చేసిందని సచిన్ చెప్పాడు. తనకు ఇలాంటి అనుభవాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ పేరిట చాలా రికార్డులు ఉన్నాయి. వాటిని ఇప్పుడప్పుడే ఎవరూ బ్రేక్ చేయలేరని నిపుణులు ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. అంతర్జాతీయంగా సచిన్ 51 టెస్టు శతకాలు సాధించాడు. మరే క్రికెటర్ కూడా సంప్రదాయ బద్ధమైన ఈ ఫార్మాట్‌లో ఇన్ని శతకాలు సాధించలేదు. వన్డేల్లో కూడా ఎన్నో రికార్డులు సాధించిన సచిన్.. ఈ ఫార్మాట్‌లో 49 శతకాలు నమోదు చేశాడు. వెరసి మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ మాత్రమే. టెస్టుల్లో 15 వేలపైగా పరుగులు చేసిన సచిన్.. వన్డేల్లో 18 వేలపైగా పరుగులు చేశాడు. ఇది కూడా రికార్డే.

Story first published: Sunday, December 18, 2022, 17:30 [IST]
Other articles published on Dec 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+