
హైదరాబాద్: విదర్భతో మ్యాచ్ ఆడి ఇక తిరుగుప్రయాణమైన ఢిల్లీ జట్టుకు విమానం కూడా సహకరించలేదు. ఇండోర్‌లోని విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానానికి టెక్నికల్ ఇబ్బంది ఎదురైందంటూ ఆపేశారు. దీంతో ఆటగాళ్లు చాలా సేపు వరకు వేచి చూసి ఫలితం లేకపోవడంతో మళ్లీ వారు బస చేసిన హోటల్ కే తిరుగు ప్రయాణం పట్టారు.
మంగళవారం రాత్రి 9:20గంటలకు బయల్దేరాల్సి ఉంది. కానీ, ప్రయాణికులు అందరూ ఎక్కగానే టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్ సరిగా లేదంటూ సమాచారం అందింది. దాంతో హఠాత్తుగా బ్రేక్‌లు వేసిన ఫైలట్ ఫ్లైట్‌ను ఆపగలిగాడు.

చివరి నిమిషంలో విమానాన్ని ఆపాల్సి వచ్చినందుకు ఐహిళ్య ఎయిర్‌పోర్డు తరపు సిబ్బంది చింతిస్తున్నాము. జట్టులోని ఆటగాళ్లకు, ప్రతినిధులకు, ఇతర సిబ్బందికి గాను భోజన సదుపాయాలను కల్పించాము.
ఆ జట్టులో ఉన్న క్రీడాకారుడు ఒకరు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాలను ఇలా వివరించాడు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ఇతనితో పాటుగా స్కిప్పర్ రిషబ్ పంత్, అన్ ముక్ చాంద్, ధ్రువ్ షొరే, నితిశ్ రానా, వికాస్ టొకాస్, ఆకాశ్ సూడన్ ఉన్నారు.
ఢిల్లీతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో తొమ్మిది వికెట్ల తేడాతో విదర్హ నెగ్గింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.