2018: నాథన్ లయన్ నుంచి కుల్దీప్.. షమీ వరకూ టాప్ బౌలర్లు వీరే..

హైదరాబాద్: 2018 బౌలర్లకు అద్భుతమైన సంవత్సరమనే చెప్పాలి. ప్రత్యేకంగా విధ్వంసకరమైన ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రత్యేకంగా టెస్టు క్రికెట్‌లో అద్శితీయమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. 2017 డిసెంబరు 18 నుంచి 2018 డిసెంబరు 18వరకూ కేవలం ఇంగ్లాండ్ జట్టు మాత్రమే భారత్ ప్రత్యర్థిగా 700 పరుగుల ఇన్నింగ్స్ ఆడగలిగింది. బ్యాట్స్‌మెన్ ఒకే ఇన్నింగ్స్‌లో 500 నుంచి 600 పరుగుల వరకూ చేయడం కేవలం రెండు సార్లు మాత్రమే సాధ్యపడిందంటే దానిని బట్టే అర్థమవుతోంది బౌలర్లు ఏ స్థాయిలో రాణించారోనని. 32 టెస్టు 12 నెలల పాటు 32 టెస్టు మ్యాచ్‍లలో భాగంగా 26వరకూ ఆడిన బౌలర్లు 15 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లనే పడగొట్టారు. కొన్ని టెస్టు మ్యాచ్‌లలో అయితే 20 వికెట్లు పడగొట్టిన సందర్భాలు లేకపోలేదు.
అన్ని ఫార్మాట్లలో ఇరగదీసిన బౌలర్లు ఇలా:

నాథన్ లయన్:
ఆస్ట్రేలియా లీడ్ స్పిన్నర్‌గా రాణిస్తోన్న నాథన్ లయన్ ఈ ఏడాది మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో లయన్ భారత వికెట్లను శాసిస్తూ అద్భుతమైన ప్రదర్శన చేయగలిగాడు. ఈ ఏడాది మొత్తం 9 టెస్టుల్లో 48 వికెట్లు పడగొట్టి 32.08 ఫామ్‌తో కొనసాగుతున్నాడు. టెస్టు క్రికెట్లో లయన్ ఒక్కడే విరాట్ కోహ్లీని ఏడు సార్లు అవుట్ చేసిన ఘనత సాధించాడు. సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌లలోనే కాకుండా విదేశాల్లో ఆడిన మ్యాచ్‌లలోనూ నాథన్ విజృంభించడంతో ఆస్ట్రేలియా జట్టులో అత్యధిక వికెట్లు తీస్తూ ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పుడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అధిక వికెట్లు తీసిన ప్లేయర్ కూడా ఇతనే.

కుల్దీప్ యాదవ్:
19వన్డేల్లో ఆడిన కుల్దీప్ 45వికెట్లు తీశాడు. వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ ప్రత్యర్థిగా కేవలం 25 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసిన ప్లేయర్‌గానూ ఘనత సాధించాడు. 2018వ సంవత్సరంలో ఇంగ్లాండ్ గడ్డపై ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. అద్భుతమైన గణాంకాలను కలిగి ఉన్న కుల్దీప్.. 9 టీ20ల్లో 21వికెట్లు పడగొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. 2018లో టీమిండియా ఆడిన 20 వన్డేల్లో 14 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లన్నింటిలో కుల్దీప్ ప్రధాన పాత్ర పోషించాడు.

కగిసో రబాడ:
సఫారీ జట్టు ఆలస్యంగానైనా పుంజుకోవడానికి కారణమేంటంటే.. దక్షిణాఫ్రికా యువ ఫేసర్ అయిన కగిసో రబాడ జట్టులో ఉండడమే. వన్డే ఫార్మాట్లలో 14 మ్యాచ్‌లలో 23 వికెట్లను ప్రతి 32 పరుగులకొక వికెట్ పడగొట్టాడు.

పాకిస్తాన్ బౌలర్ యాసిర్ షా
పాకిస్తాన్ బౌలర్ యాసిర్ షా.. 33 మ్యాచ్‌తో 200వికెట్ల క్లబ్‌లో చేరాడు. యూఏఈ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడిన మూడో టెస్టులో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో 82ఏళ్ల నాటి రికార్డును కొల్లగొట్టినట్లు అయింది.

మొహమ్మద్ షమీ:
భారత స్పీడ్ బౌలర్ మొహమ్మద్ షమీ.. 11 మ్యాచ్ లలోనే 44 వికెట్లు పడగొట్టాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాపై మంచి గణాంకాలు సాధించాడు. 56 పరుగులిచ్చి 6వికెట్లను ఒకే ఇన్నింగ్స్‌లో సంపాదించుకున్నాడు. ఎనిమిది టెస్టులో 39వికెట్లు తీసిన ఘనత షమీ ఖాతాలో ఉంది. మరో భారత బౌలర్ ఇషాంత్ 9 మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు తీశాడు. ఈ ఏడాది అతని వ్యక్తిగత జీవితం మొత్తం వివాదాలతో జరిగింది.

రషీద్ ఖాన్:
అఫ్థనిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ జట్టుకు లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 2018వ సంవత్సరంలో 20వన్డేలు ఆడి 48వికెట్లను తీశాడు. 8 టీ20ల్లో 22వికెట్లు పడగొట్టాడు.

దిల్‌రువాన్ పెరీరా
శ్రీలంక ఆఫ్ ప్పిన్నర్ దిల్‌రువాన్ పెరీరా 10 మ్యాచ్‌లలో 48 వికెట్లు పడగొట్టాడు. టెస్టు మ్యాచ్‌లలో ఈ ఏడాది 22వికెట్లు తీసిన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో తలపడిన మ్యాచ్ లంక జట్టు తరపున ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచి కేవలం సఫారీ గడ్డపైనే 16 వికెట్లు కొల్లగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications