Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లాష్‌బ్యాక్ 2016: టాప్‌లో కోహ్లీ, టీ20 బ్యాట్స్‌మెన్లు వీరే

హైదరాబాద్: ఈ ఏడాది ప్రపంచ క్రికెట్‌ టీ20 మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శనలను చూశాం. 2016లో జరిగిన వరల్డ్ టీ20 టోర్నమెంట్‌తో పాటు అన్ని జట్లు కూడా సాధారణ టీ20 మ్యాచ్‌లను ఆడాయి. వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

భారత్‌ ఆతిథ్యమిచ్చిన ఈ వరల్డ్ టీ20లో టీమిండియా సెమీస్‌లో ఇంటిదారి పట్టింది. అయితే ఈ ఏడాది టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టు అద్భుతమైన గణాంకాలను నమోదు చేసింది. ఈ ఏడాది టీమిండియా మొత్తం 21 టీ20 మ్యాచ్‌లను ఆడగా అందులో 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఒకటి రద్దు అయింది.

Vs ఆస్ట్రేలియా (in Australia): Played 3, won 3.
Vs శ్రీలంక (in India): Played 3, won 2, lost 1.
ఆసియా కప్ టీ20 (in Bangladesh): Played 5, won 5.
వరల్డ్ టీ20 (in India): Played 5, won 3, lost 2.
Vs జింబాబ్వే (in Zimbabwe): Played 3, won 2, lost 1.
Vs West Indies: Played 2: Lost - 1, No Result - 1.

టీ20 అనగానే పరుగుల వరద మనకు గుర్తుకు వస్తుంది. ఈ ఏడాది విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనను కనబర్చాడు. 'రన్ మెషిన్' గా గుర్తింపు పొందిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కు 2016 బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ముగిసే సరికి ర్యాంకుల్లో కోహ్లీ నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. కోహ్లీ తర్వాత భారత్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.

ఈ ఏడాది టాప్ 6 టీ20 బ్యాట్స్‌మెన్లు వీరే:

విరాట్ కోహ్లీ (ఇండియా)

విరాట్ కోహ్లీ (ఇండియా)

2016 కోహ్లికి బాగా కలిసొచ్చింది. మూడు ఫార్మెట్లలో కూడా పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా టీ20ల్లో ఫోర్లు, సిక్సులతో సత్తా చాటాడు. 2016లో ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో కోహ్లీ 4 సెంచరీలతో మొత్తం 973 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐసీసీ టీ20ల విషయానికి వస్తే 15 మ్యాచ్‌లాడిన కోహ్లీ 140.26 స్ట్రయిక్ రేట్‌తో 641 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 90 నాటౌట్.

మహ్మాద్ షహ్జాద్ (ఆప్ఘనిస్థాన్)

మహ్మాద్ షహ్జాద్ (ఆప్ఘనిస్థాన్)

డిసెంబర్ 22న (గురువారం) ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో మహ్మాద్ షహ్జాద్ ఐసీసీ అసోసియేట్/అఫిలియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆప్ఘనిస్థాన్ జట్టు వికెట్ కీపర్ అయిన మహ్మాద్ షహ్జాద్ టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని. ఈ ఏడాది 15 టీ20 మ్యాచ్‌లాడిన మహ్మాద్ షహ్జాద్ 520 పరుగులతో కోహ్లీ తర్వాత రెండో స్ధానంలో నిలిచాడు. షార్జాలో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో 118 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

రోహిత్ శర్మ (ఇండియా)

రోహిత్ శర్మ (ఇండియా)

ముంబైకి చెందిన ఈ బ్యాట్స్‌మెన్ 18 టీ20 మ్యాచ్‌లాడి 497 పరుగులతో మూడో స్ధానంలో నిలిచాడు. అందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. యావరేజి 29.23. ఈ ఏడాది భారత్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ రెండో స్ధానంలో నిలిచాడు.

షబ్బీర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)

షబ్బీర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)

ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో షబ్బీర్ రెహ్మాన్ నాలుగో స్ధానంలో నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లో 35.61 యావరేజితో 463 పరుగులు చేశాడు. రెహ్మాన్ ఆడిన 16 మ్యాచ్‌ల్లో 15 మ్యాచ్ లు స్వదేశంలోనే ఆడాడు. రెహ్మాన్ స్ట్రయిక్ రేట్ 127.53గా ఉంది. స్వదేశంలో జరిగిన అనేక సిరిస్‌లలో జట్టు విజయాల్లో రెహ్మాన్ కీలక పాత్ర పోషించాడు.

గ్లెన్ మాక్స్ వెల్ (ఆస్ట్రేలియా)

గ్లెన్ మాక్స్ వెల్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్ వెల్ ఐదోస్ధానంలో నిలిచాడు. 11 మ్యాచ్‌లాడిన గ్లెన్ మాక్స్ వెల్ 435 పరుగులతో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. ఈ ఏడాది టీ20ల్లో గ్లెన్ మాక్స్ వెల్ అత్యధికస్కోరు 145 నాటౌట్. అద్భుతమైన షాట్లకు పేరుగాంచిన గ్లెన్ మాక్స్ వెల్ 48.33 యావరేజితో 174.69 యావరేజితో కొనసాగుతున్నాడు.

మార్టిన్ గుప్తిల్ (న్యూజిలాండ్)

మార్టిన్ గుప్తిల్ (న్యూజిలాండ్)

న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్తిల్ ఈ ఏడాది 9 మ్యాచ్‌లాడి 392 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 87 నాటౌట్. 2016లో గుప్తిల్ స్ట్రయిక్ రేట్ 171.92గా ఉంది. ఇక యావరేజి విషయానికి వస్తే 4 అర్ధ సెంచరీలతో 49గా ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+