Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్లాష్‌బ్యాక్ 2016: కోహ్లీనే బెస్ట్, టాప్ 5 టెస్టు బ్యాట్స్‌మెన్ వీరే

హైదరాబాద్: 2016... టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతగానో కలిసొచ్చింది. ఈ ఏడాది మూడు ఫార్మెట్లలోనూ విరాట్ కోహ్లీ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో కోహ్లీ ఈ ఏడాది తన అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను సైతం సృష్టించాడు.

ఈ ఏడాది టెస్టు క్రికెట్లో కోహ్లీ ఎన్నో సెన్సేషనల్ ఇన్నింగ్స్‌ను ఆడాడు. కోహ్లీతో పాటు ఈ ఏడాది పలువురు క్రికెటర్లు టెస్టుల్లో పరుగుల సునామీని సృష్టించారు. కోహ్లీ తర్వాత పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ, ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, జానీ బెయిర్ స్టో, అలెస్టర్ కుక్ తదితరులు ఉన్నారు.

ఈ ఏడాది టాప్ 5 టెస్టు బ్యాట్స్‌మెన్లు:

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

ఈ ఏడాది 12 టెస్టులాడిన కోహ్లీ 1,251 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. 2016లో కోహ్లీ యావరేజి 75.93గా ఉంది. 2016కు ముందు కోహ్లీ ఖాతాలో ఒక్క డబుల్ సెంచరీ కూడా లేకపోవడం విశేషం. అంతేకాదు టెస్టుల్లో కోహ్లీ యావరేజి 50కి మించలేదు. అదే 2016 చివరికి మూడు ఫార్మెట్లలో 50కి పైగా యావరేజిని కలిగి ఉన్న ఒకే ఒక్క ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇంగ్లాండ్‌తో సిరిస్‌కు ముందు కోహ్లీ యావరేజి 44.40గా ఉంది.

కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఐదు టెస్టు సిరిస్‌లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇక భారత్‌కు వరుసగా 18 టెస్టు విజయాలనందించిన కెప్టెన్‌గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 84 ఏళ్ల టెస్టు చరిత్రను కోహ్లీ తిరిగరాశాడు. ఈ ఏడాది చివరలో న్యూజిలాండ్‌పై 3-0తో, ఇంగ్లాండ్‌పై 4-0తో టీమిండియా టెస్టు సిరిస్‌లను కైవసం చేసుకుంది.

అజహర్ అలీ

అజహర్ అలీ

పాకిస్థాన్‌కు చెందిన అజహర్ అలీ ఈ ఏడాది ఆ జట్టు తరుపున వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 11 టెస్టులాడిన అజహర్ అలీ 64.16 యావరేజితో 1155 పరుగులు చేశాడు. కోహ్లీకి అతి సమీపంలో 75 పరుగుల దూరంలో అలీ ఒక్కడే ఉండటం విశేషం. ఈ ఏడాది అజహర్ అలీ మూడు సెంచరీలు నమోదు చేశాడు. అజహర్ అలీ అత్యధిక స్కోరు 302 నాటౌట్. అందులో నాలుగు అర్ద సెంచరీలు కూడా ఉన్నాయి. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ సాధించడంతో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు.

మరోవైపు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పలు రికార్డులను సైతం అజహర్ అలీ నమోదు చేశాడు. పాకిస్ధాన్ జట్టు నుంచి ఈ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా అజహర్ అలీ చరిత్రి సృష్టించాడు. గతంలో పాక్ ఆటగాడు మాజిద్ ఖాన్ 158 పరుగుల రికార్డుని ఈ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ అధిగమించాడు.

జో రూట్

జో రూట్

ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ 17 టెస్టులాడి 1477 పరుగులతో ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మొట్టమొదటి స్ధానంలో నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. 2016లో జో రూట్ యావరేజి 49.23గా ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జో రూట్ ఈ ఏడాది అత్యధిక పరుగులు (254) నమోదు చేశాడు. కోహ్లీలాగే ప్రస్తుత మోడ్రన్ క్రికెట్‌లో జో రూడ్ క్రీడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

జానీ బెయిర్ స్టో

జానీ బెయిర్ స్టో

ఇంగ్లాండ్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ ఈ ఏడాది టెస్టుల్లో చెలరేగి ఆడాడు. జో రూట్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 17 టెస్టులాడిన బెయిర్ స్టో 58.80 యావరేజితో ఈ ఏడాది 1470 పరుగులు చేశాడు. జో రూట్ లాగే బెయిర్ స్టో కూడా ఈ ఏడాది 3 టెస్టు సెంచరీలు సాధించాడు. 8 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి బెయిర్ స్టో ఈ పరుగులు సాధించాడు.

అలెస్టర్ కుక్

అలెస్టర్ కుక్

భారత్‌తో జరిగిన టెస్టు సిరిస్‌ను 4-0తో చేజార్చుకున్నప్పటికీ వ్యక్తిగతంగా అలెస్టర్ కుక్ ఈ ఏడాది పలు రికార్డులను నమోదు చేశాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ రికార్డుని సైతం అధిగమించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 10000 పరుగులను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా అలెస్టర్ కుక్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లాడిన రికార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది 17 టెస్టులాడిన అలెస్టర్ కుక్ 42.33 యావరేజితో 1270 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. చెన్నై టెస్టులో కుక్ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

తన కెరీర్‌లో 140 టెస్టులాడిన అలెస్టర్ కుక్‌ మొత్తం 252 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో 11 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న పదో బ్యాట్స్‌మెన్‌గా అలెస్టర్ కుక్ గుర్తింపు పొందాడు. ఇక ఇంగ్లాండ్ తరుపున ఈ ఘనతను సాధించి ఏకైక క్రికెటర్‌గా కుక్ చరిత్ర సాధించాడు. ఇక ఇంగ్లాండ్ తరుపున ఈ ఘనతను సాధించి ఏకైక క్రికెటర్‌గా కుక్ చరిత్ర సాధించాడు.

అంతేకాదు 11వేల పరుగుల మైలురాయిని అత్యంగ వేగంగా అందుకున్న 8వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. చందర్ పాల్, అలెన్ బోర్డర్ ఈ ఘనతను సాధించడానికి మరిన్ని టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే అలెస్టర్ కుక్ 11వేల పరుగుల మైలురాయిని సాధించేందుకు 10 సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+