ఫ్లాష్‌బ్యాక్ 2016: చివర్లో జో రూట్‌ని మించి కోహ్లీ పరుగులు
హైదరాబాద్: 2016లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు ఫార్మెట్లు కలిపి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్న కోహ్లీ ఈ ఏడాది చివరకు నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌ను 4-0తో కైవసం చేసుకోవడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరిస్‌గా నిలిచిన కోహ్లీ పరుగుల సునామీలో జో రూట్‌ని అధిగమించాడు. మోడ్రన్ క్రికెట్‌లో వీరిద్దరినీ క్రీడా పండితులు గ్రేట్ బ్యాట్స్‌మెన్లుగా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే.
2016 సంవత్సరానికి గాను మూడు ఫార్మెట్లలో కోహ్లీ 2,595 పరుగులు సాధించి మొదటి స్ధానంలో నిలవగా, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 2,567 పరుగులతో రెండో స్ధానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు నిలిచారు.
ఇక ఒక కేలండర్ ఇయర్‌లో మూడు ఫార్మెట్లు కలిపి 2000కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లుగా విరాట్ కోహ్లీ, జో రూట్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు నిలిచారు. ఇక ఒక కేలండర్ ఇయర్‌లో 1000కి పైగా పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో అజ్యింకె రహానే, రోహిత్ శర్మలు ఉన్నారు.
2016లో టాప్ స్కోరర్లు వీరే:

విరాట్ కోహ్లీ
ఈ ఏడాది మూడు ఫార్మెట్లలో కోహ్లీ చెలరేగి ఆడాడు. 35 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన కోహ్లీ 2595(టెస్టుల్లో 1251, వన్డేల్లో 739, టీ20ల్లో 641) పరుగులు సాధించాడు. ఈ ఏడాది కోహ్లీ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది 12 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 1,251 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. 2016లో కోహ్లీ యావరేజి 75.93గా ఉంది.

జో రూట్
ఈ ఏడాది 39 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన జో రూట్ 2567(టెస్టుల్లో 1477, వన్డేల్లో 796, టీ20ల్లో 297) పరుగులు సాధించాడు. జో రూట్ అత్యధిక స్కోరు 254. ఈ ఏడాది 17 టెస్టులాడిన జో రూట్ 1,477 పరుగులతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. 2016లో జో రూట్ యావరేజి 49.23గా ఉంది.

డేవిడ్ వార్నర్
ఈ ఏడాది 44 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 2,374(టెస్టుల్లో 748, వన్డేల్లో 1388, టీ20ల్లో 238) పరుగులు సాధించాడు. వార్నర్ అత్యధిక స్కోరు 173. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నారు.

స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ ఏడాది 45 మ్యాచ్‌లాడి 2,251(టెస్టుల్లో 924, వన్డేల్లో 1154, టీ20ల్లో 173) పరుగులు సాధించాడు. ఈ ఏడాది స్టీవ్ స్మిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 149.

కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది 1726(టెస్టుల్లో 753, వన్డేల్లో 590, టీ20ల్లో 383) పరుగులు సాధించాడు. ఇటీవల భారత్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో కేన్ విలియమ్సన్ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ, స్వదేశంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో రాణించాడు.

క్వంటన్ డి కాక్
దక్షిణాఫ్రికాకు చెందిన క్వంటన్ డి కాక్ ఈ ఏడాది 32 మ్యాచ్ లాడి 1712 (టెస్టుల్లో 626, వన్డేల్లో 857, టీ20ల్లో 229) పరుగులు సాధించాడు. ఈ ఏడాది క్వంటన్ డి కాక్ అత్యధిక స్కోరు 178. వన్డేల్లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గాను ఐసీసీ ప్రకటించిన వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

హషీం ఆమ్లా
దక్షిణాఫ్రికా తరుపు నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న మరో ఆటగాడు హషీం ఆమ్లా. ఈ ఏడాది 30 మ్యాచ్ లాడిన ఆమ్లా 1500 (టెస్టుల్లో 681, వన్డేల్లో 511, టీ20ల్లో 308) పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆమ్లా అత్యధిక స్కోరు 201.

దినేష్ చండీమాల్
శ్రీలంక తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు దినేష్ చండీమాల్. ఈ ఏడాది 37 మ్యాచ్ లాడిన దినేష్ చండీమాల్ 1479 (టెస్టుల్లో 450, వన్డేల్లో 656, టీ20ల్లో 373) పరుగులు సాధించాడు.

అలెక్స్ హాల్స్
జో రూట్ తర్వాత ఇంగ్లాండ్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా అలెక్స్ హాల్స్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది 32 మ్యాచ్ లాడిన అలెక్స్ హాల్స్ 1426 (టెస్టుల్లో 537, వన్డేల్లో 743, టీ20ల్లో 146) పరుగులు సాధించాడు. ఈ ఏడాది అలెక్స్ హాల్స్ అత్యధిక స్కోరు 171గా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications