రమేషు..సురేషు: మీకో దండం రా బాబు: సరిపోయారిద్దరూ: తట్టా బుట్టా సర్దేసుకోండమ్మా

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ మరో దారుణ పరాజయాన్ని చవి చూసింది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా, అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన.. అత్యంత అవమానకర ఓటమిని ఎదుర్కొంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తయింది. ఆ జట్టుకు ఇది వరుసగా నాలుగో ఓటమి. సీజన్ ఆరంభమైన ఇన్ని రోజులైనప్పటికీ.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపును రుచి చూసిన పాపాన పోలేదు.

బ్యాక్ ప్యాక్ సర్దేసుకోవడమే
ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లోనూ పరాజయాలే ఎదురయ్యాయి. ఇకపై గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గెలిచినా.. టైటిల్ రేసులో ఉంటుందనే నమ్మకమూ లేదు. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్, రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఆ తరువాత కోల్‌కత నైట్ రైడర్స్.. ఇప్పుడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో మట్టి కరిచింది రోహిత్ సేన. ప్యాకప్ చేసుకోవడానికి రెడీగా ఉండక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది ఈ జట్టు.

అయిదుసార్లు ఛాంపియన్..
నిజానికి- రోహిత్ సేన అల్లాటప్పా జట్టేమీ కాదు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్ ఇది. ఇప్పటిదాకా అయిదుసార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020ల్లో విజేతగా ఆవిర్భవించింది. ఇన్నిసార్లు టైటిల్‌ను గెలిచిన జట్టు మరొకటి లేనే లేదు. ఈ సీజన్ కోసం నిర్వహించిన మెగా వేలం పాటల్లో సమర్థులైన ప్లేయర్లను సమకూర్చుకుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొల్లార్డ్, జస్‌ప్రీత్ బుమ్రా.. వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. పరాజయాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.

ముంబైకి తోడుగా సీఎస్‌కే
ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్.. తోడుగా ఉంది ముంబై ఇండియన్స్‌కు. ఇది సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టు. సారథ్యాన్ని మారిన తరువాత వరుస ఓటములను చవి చూస్తోంది. ముంబై ఇండియన్స్ తరహాలోనే ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున.. అంటే పదో స్థానంలో నిలిచింది. హేమాహేమల్లాంటి ప్లేయర్లు ఉన్న జట్టు ఇది. అయినా ప్రత్యర్థి టీమ్ ఇస్తోన్న షాక్‌లకు కుదేల్ అవుతోంది.

నాలుగు సార్లు ఛాంపియన్..
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్. 2010, 2011, 2018, 2021ల్లో విజేత ఆ జట్టే. పలుమార్లు రన్నరప్‌గా నిలిచింది. 2020లో తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు కూడా వెళ్లలేకపోయింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైన తరువాత.. ఇప్పటిదాకా కోలుకోవట్లేదు. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఆ తరువాత పంజాబ్ కింగ్స్.. నాలుగో మ్యాచ్‌లో చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలోనూ మట్టి కరిచింది.

ఫ్యాన్స్ ఫైర్..
ఈ పరిణామాలపై ఆ రెండు జట్ల అభిమానులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. సోషల్ మీడియా వేదికగా మెమెస్‌తో చెలరేగిపోతున్నారు. ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తోన్నారు. రవీంద్ర జడేజా, రోహిత్ శర్మను రమేష్-సురేష్‌గా అభివర్ణిస్తున్నారు. తట్టా బట్టా సర్దేసుకోవడానికి రెడీగా ఉండాలంటూ సూచిస్తోన్నారు. ఈ రెండు జట్లూ ఇంకా టైటిల్ గెలుస్తాయనే ఆశలు లేవంటూ భవిష్యత్ దర్శనం చేస్తోన్నారు. ఈ సీజన్‌లో మోస్ట్ అన్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ఇవేనంటూ ఎద్దేవా చేస్తోన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications