Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మసీద్‌పై ఘాటుగా స్పందించిన భజ్జీ, యువరాజ్

Yuvraj Singh-Harbhajan Singh
మజార్ మసీద్‌ చెప్పిన సమాచారం ప్రకారం ఇండియన్ ప్లేయర్స్‌లలో హార్బజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లు కూడా మజార్ మసీద్‌కు అందుబాటులో ఉంటారని, వీరితో పాటు ఇక వెస్ట్ ఇండిస్‌కు చెందిన క్రిస్ గేల్, ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్, బ్రెట్ లీ వీళ్ళంతా తనకు టచ్‌లో ఉంటారని నాల్గవ రోజు విచారణ సందర్బంగా మజార్ మజీద్ మాట్లాడిన మాటలను రికార్డ్ చేయడం జరిగింది. ఐతే పైన పేర్కోన్న క్రికెట్ ఆటగాళ్లు మజార్ మసీద్‌కి ఏవిధంగా పరిచయం ఉన్నారో మాత్రం తెలియజేయలేదని సమాచారం. పాఠకులకు నిన్న వన్ ఇండియా స్పోర్ట్స్ న్యూస్‌లో పాకిస్ధానీ బుకీ ఏజెంట్ మజార్ మసీద్‌ నోటివెంట ఇండియన్ టీమ్ ప్లేయర్స్‌తో సంబంధం ఉందని ఆర్టికల్‌లో మనం చూశాం.

ఈ వార్తలపై పైన పేర్కోన్న క్రికెట్ ఆటగాళ్లు అందరూ చాలా త్వరగా స్పందించి వివరణ ఇవ్వడం జరిగింది. యువరాజ్ సింగ్ ఐతే ఏకంగా దీనికి గాను తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. యువరాజ్ తన ట్విట్టర్‌లో 'మజీద్‌ ఎవరు!! ఇది నిజంగా చెత్త వార్త! అతడి ఎప్పుడూ కలవలేదు' అని ట్విట్టర్‌లో యువీ రాశాడు. ' ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతడిని కలవలేదు. నేను తప్పనిసరిగా అతడిపై ఏదో ఒక చర్య తీసుకుంటాను. అది న్యాయపరమైన లేదా మరేదైనా కావచ్చు. బిసిసిఐ ద్వారా నోటుసులు పంపిస్తానని అన్నారు.

మరో ప్రక్క ప్రస్తుతం నాగపూర్‌లో ఉన్న భజ్జీ దీనిపై తీవ్రంగా స్పందించాడు. క్రికెట్‌ను నాశనం చేస్తున్న ఇలాంటి వారిపై బోర్డు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపాడు. ఇది ఇలా ఉంటే ఈ వార్తలు ఆస్టేలియాలో కూడా వివాదాలు సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మేనేజర్‌ రాబ్‌ హర్టన్‌ తీవ్రంగా ఖండించారు. ' అసలు మజర్‌ మజీద్‌ పేరు ఇంతవరకు వినలేదు. అలాంటప్పుడు అతన్ని ఎలా కలుస్తాము?" అని రాబ్‌ ప్రశ్నించారు. అంతకుముందు బూకీ మజర్‌తో నాథన్‌ బ్రాకెన్‌కు సంబంధాలు ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. దీనిపై రాబ్‌ స్పందిస్తూ పై వ్యాఖ్యలను చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియా మాజీ కెప్టన్‌ రికీ పాంటింగ్‌ మేనేజర్‌ జేమ్స్‌ హెండర్సన్‌ కూడా ఈ వ్యాఖ్యలను కొట్టివేశారు. మజర్‌ను ఎప్పుడు కలవలేదని తెలిపారు. పాకిస్థాన్‌ పేసర్‌ వకార్‌ యూనిస్‌ కూడా మజర్‌ను ఎప్పుడు కలవలేదని, మాక్స్‌ ఫిక్సింగ్‌ పాల్పడలేదన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+