
క్వారంటైన్‌ను కూడా కంప్లీట్:
భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం శ్రీలంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసింది. ఈ రోజు (శుక్రవారం) నుంచి ప్రాక్టీస్ కూడా ఆరంభించింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తాజాగా సమాచారం తెలుస్తోంది.

కాంట్రాక్ట్‌పై సంతకం చేయని లంక క్రికెటర్లు:
శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య కాంట్రాక్ట్‌కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఇటీవల కొన్ని విదేశీ పర్యటనల ముందు కూడా ఆటగాళ్లు ఇదే విషయమై బోర్డుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌కి ముందు కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు లంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్‌దెనియా నిరాకరించారు. లంక బోర్డు నేషనల్ కాంట్రాక్ట్ నిమిత్తం మొత్తం 24 మంది క్రికెటర్లకి ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేయమని బోర్డుకు స్పష్టం చేశారని తెలుస్తోంది.

ఆ ఐదుగురు కూడా దూరమైతే:
ఈ ఐదుగురు ప్లేయర్స్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయకపోతే.. ట్రైనింగ్ సెషన్‌కి హాజరుకాలేరు. ఆపై స్వదేశం వచ్చాక భారత్‌తో సిరీస్ కోసం ఏర్పాటు చేసే బయో బబుల్‌లోకి వీరికి అనుమతి ఉండదు. అదే జరిగితే.. వీరు సిరీస్‌కి దూరమవడం ఖాయం. ఇప్పటికే ఇంగ్లండ్ టూర్‌లో బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన కుశాల్, గుణతిలక, డిక్లెల్వా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. వీరిపై నిషేధం పడే సూచనలు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు దూరమవడంతో ఇప్పటికే బలహీనపడిన శ్రీలంక.. ఆ ఐదుగురు క్రికెటర్లు కూడా సిరీస్‌కి దూరమైతే లంకకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది.

జూలై 13 సిరీస్ ఆరంభం:
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో.. ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అన్ని మ్యాచులు జరుగుతాయి. వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలు, టీ20లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి.


Click it and Unblock the Notifications












