
సంజూ శాంసన్
జట్టులో ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధపడే ఆటగాడు సంజూ శాంసన్. ఐపీఎల్‌లో అదరగొడుతున్న అతను 138 మ్యాచుల్లో 135.72 సగటుతో 3526 పరుగులు సాధించాడు. ఈ ఏడాది భారత్ తరఫున ఆరు టీ20ల్లో ఆడిన అతను 158.40 సగటుతో 179 పరుగులు చేశాడు. ఇక వన్డేల విషయానికొస్తే పది మ్యాచుల్లో 105.57 సగటుతో 284 పరుగులు చేశాడు. పరిస్థితికి తగినట్లు తన ఆటతీరును మార్చుకోవడం సంజూ స్పెషాలిటీ. నిదానంగా ఆడుతూనే చటుక్కున గేరు మార్చి జట్టుకు ఎలాంటి స్కోరునైనా అందించగలడు.

సూర్యకుమార్ యాదవ్
ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 తొలి టీ20 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఎలాంటి పిచ్ అయినా, ఏ బౌలర్ అయినా తనదైన రోజున విధ్వంసం సృష్టించగల సత్తా సూర్య సొంతం. అయితే వన్డే ఫార్మాట్‌లో అతని రికార్డు అంత బాగలేదు. తన కెరీర్‌లో 16 వన్డేలు ఆడిన సూర్య 32 సగటుతో కేవలం 384 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ పొట్టి ఫార్మాట్‌లో నాలుగో నెంబర్ బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్న అతనికే వన్డేల్లో కూడా చోటు కల్పించాలని డిమాండ్లు ఉన్నాయి. భవిష్యత్తులో అతనికే వన్డేల్లో కూడా నాలుగో స్థానంలో ఆడే అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదు.

కేఎల్ రాహుల్
ప్రస్తుతం అంత మంచి ఫామ్‌లో లేని ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. తన కెరీర్‌లో 72 టీ20లు ఆడిన అతను 139.12 సగటుతో 2265 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో అయితే 45 మ్యాచుల్లో 87.86 స్ట్రైక్ రేటుతో 1665 పరుగులు సాధించాడు. టీ20ల్లో ఓపెనర్ అయినా కూడా.. వన్డేల్లో మిడిలార్డర్ బ్యాటర్‌గా చక్కగా రాణించాడు. తన కెరీర్‌లో నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ 41.80 సగటుతో 209 పరుగులు చేశాడీ కుడిచేతి వాటం బ్యాటర్. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ నాటికి నాలుగో స్థానం రాహుల్‌కే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రిషభ్ పంత్
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత పేలవంగా ఆడుతున్న బ్యాటర్ ఎవరైనా ఉంటే అది రిషభ్ పంత్ అని చెప్పాలి. అయితే టెస్టుల్లో మాత్రం అతను అద్భుతమైన ఆటగాడని చెప్పాలి. తన కెరీర్‌లో 31 టెస్టులు ఆడిన అతను 43.32 సగటుతో 2123 పరుగులు సాధించాడు. వన్డేల విషయానికొస్తే.. 30 మ్యాచుల్లో 106.65 స్ట్రైక్ రేటుతో కేవలం 865 పరుగులు చేశాడు. వన్డేల్లో పంత్‌ను 16 మ్యాచుల్లో నాలుగో నెంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు దించగా.. 97.61 స్ట్రైక్ రేటుతో 492 పరుగులు చేశాడు. మరి అతనికే వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కినా దక్కొచ్చు.

శ్రేయాస్ అయ్యర్
వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకునే రేసులో అందరి కన్నా ముందున్న యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. కెరీర్‌లో మొత్తం 36 వన్డేలు ఆడిన అతను 49.24 సగటుతో 1428 పరుగులు నమోదు చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. ఈ ముంబై ప్లేయర్ ఈ ఏడాది వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాదిలో 14 వన్డేలు ఆడి 95.49 స్ట్రైక్ రేట్‌తో 615 పరుగులు చేశాడు. కివీస్ పర్యటనలో కూడా రాణించాడు. దీంతో వన్డేల్లో నాలుగో నెంబర్‌లో అతన్నే దింపాలని చాలా మంది వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications












