Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ అండర్-19 జట్టులో ఐదుగురు భారత కుర్రాళ్లు

Five Indians in ICC Under-19 World Cup team

హైదరాబాద్: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత కుర్రాళ్లకు ఐసీసీ జట్టులోనూ ప్రాధాన్యత లభించింది. అండర్-19 వరల్డ్ కప్‌ను రికార్డు స్థాయిలో నాలుగో సారి దక్కించుకున్న యువ భారత్ జట్టులోని ఆటగాళ్లు ఐసీసీ వరల్డ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు.

ఆదివారం ఐసీసీ ప్రకటించిన అండర్‌-19 వరల్డ్ కప్ జట్టులో భారత కుర్రాళ్లు ఐదుగురు చోటు దక్కించుకున్నారు. 5 ఇన్నింగ్స్‌ల్లో 261 పరుగులు చేసిన కెప్టెన్‌ పృథ్వీ షాతో పాటు ఫైనల్లో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అందుకున్న మన్‌జోత్‌ కల్రా (252), మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు అందుకున్న శుభమాన్‌ గిల్‌ (372) ఎంపికయ్యారు.

ఇక, బౌలర్ల విషయానికి వస్తే స్పిన్నర్ అనుకుల్‌ రాయ్‌ (14 వికెట్లు), ఫాస్ట్ బౌలర్లు కమలేష్ నాగర్‌కోటి (9)లకు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన రేనార్డ్ వాన్‌డర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఆఫ్ఘన్ నుంచి ఎంపికైన ఏకైక క్రికెటర్‌గా క్వాయిస్ అహ్మద్ నిలిచాడు. మాజీ క్రికెటర్లు బిషప్‌, అంజుమ్‌ చోప్రా, జెఫ్‌ క్రో, టామ్‌ మూడీలతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ శశాంక్‌ కిశోర్‌ ఈ జట్టును ఎంపిక చేశారు.

ఐసీసీ అండర్-19 వరల్డ్ జట్టు:
పృథ్వీషా, మన్‌జ్యోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, ఫిన్ అలెన్(న్యూజిలాండ్), రేనార్డ్ వాన్‌డర్(కెప్టెన్), వాండైల్ మక్వెటు, గెరాల్డ్ కొట్జె(దక్షిణాఫ్రికా), అనుకుల్ రాయ్, కమలేశ్ నాగర్‌కోటి, క్వాయిస్ అహ్మద్(ఆఫ్ఘనిస్థాన్), షాహీన్ అఫ్రిదీ(పాకిస్థాన్), అలిక్(వెస్టిండీస్, 12వ ఆటగాడు).

Story first published: Monday, February 5, 2018, 11:25 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+