Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్ రాయల్స్ టాప్-5 హైస్కోరింగ్ మ్యాచ్‌లు

five highest match aggregates when Rajasthan Royals plays in ipl

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సోమవారం రాత్రి జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు కలిపి 400పరుగులు దాటాయి. అలాగే మొత్తం 15వికెట్లు పడ్డాయి. యజ్వేంద్ర చాహల్ తీసిన హ్యాట్రిక్ వల్ల రాజస్థాన్ రాయల్స్.. కోల్‌కతాపై పైచేయి సాధించింది.

ఇలా ఐపీఎల్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు కలిపి 400కు పైగా పరుగులు నమోదు కావడం ఇది 15వ సారి. ఇలాంటి హైస్కోరింగ్ మ్యాచ్‌లు ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్ ఆ మ్యాచ్‌లో ఓ జట్టుగా ఉన్నప్పుడు నమోదు కావడం గమనార్హం.

1) ఐపీఎల్-2010లో చెన్నైలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా నిలిచింది. ఇరు జట్లు భీకరంగా చెలరేగడంతో ఆ మ్యాచ్‌లో మొత్తం 469పరుగులు నమోదయ్యాయి.

2) ఐపీఎల్-2020లో షార్జా వేదికగా పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 449పరుగులు నమోదయ్యాయి.

3) ఐపీఎల్-2021లో రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 438 పరుగులు నమోదయ్యాయి.

4). ఐపీఎల్-2008లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ డెక్కన్ ఛార్జర్స్‌(సన్ రైజర్స్ హైదరాబాద్) మధ్య జరిగిన మ్యాచ్‌లో 431పరుగులు నమోదయ్యాయి.

5) తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో 15వికెట్లతో సహా 427పరుగులు వచ్చాయి.

five highest match aggregates when Rajasthan Royals plays in ipl

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. జోస్ బట్లర్ క్లాస్ సెంచరీ నేపథ్యంలో 217పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక అనంతరం ఛేదనకు దిగిన కోల్ కతా నైట్‌ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (85), ఆరోన్ ఫించ్ (58) చెలరేగడంతో ఒకానొక దశలో గెలుపు కేకేఆర్‌దేననిపించింది. కానీ యుజ్వేంద్ర చాహల్ తన హ్యాట్రిక్‌ సహా ఒకే ఓవర్లో 4వికెట్లతో మ్యాచ్‌ను కేకేఆర్ నుంచి లాగేసుకుని రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు.

Story first published: Tuesday, April 19, 2022, 13:32 [IST]
Other articles published on Apr 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+