
వీరబాదుడుకు తోడు సెంటిమెంట్
‘మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని జట్టుకు ఇది మూడో ట్రోఫీ. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొంది కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంలో షేన్ వాట్సన్(57 బంతుల్లో 117) వీరబాదుడుకు తోడు మరో సెంటిమెంట్ కూడా కలిసొచ్చిందని కెప్టెన్ కూల్ చెప్పుకొచ్చాడు.

7 సెంటిమెంట్ కీలకంగా భావించా
‘ఫైనల్స్ అనేసరికి అందరూ నంబర్లను పోల్చుకుంటూ ఉంటారు. నేనైతే నంబర్ 7 సెంటిమెంట్ కీలకంగా భావించా. మ్యాచ్ తేదీ మే 27. సాధించాల్సిన స్కోరు 179, నా జెర్సీ నంబర్ కూడా 7. అన్నింటికంటే మించి చెన్నై టీమ్ ఫైనల్స్‌కు రావడం ఇది 7వసారి. అన్ని చోట్లా 7 ఉంది. అలా కలిసొచ్చింది(నవ్వులు). అఫ్‌కోర్స్, సెంటిమెంట్ల సంగతి ఎలా ఉన్నా జట్టు ప్రదర్శన అనేది కీలకం' అని చెప్పాడు ధోని.

బ్రావోని వద్దని చెబుతా:
కీలకమైన ఫైనల్స్‌లో చెన్నై ఓపెనర్ ఫ్యాప్ డుప్లిసిస్(10) స్కోరుకే అవుటయ్యాడు. అప్పటికే డేన్ బ్రావో ప్యాడ్లు కట్టుకుని సిద్ధమైపోయాడు. కానీ ఆర్డర్ ప్రకారం రైనానే వచ్చాడు. దీనిపై ధోనీ వివరణ ఇస్తూ.. ‘బ్రావోని సిద్ధంగా ఉండమని నేనేమీ చెప్పలేదు. తనంతట తానే ప్యాడ్స్ కట్టుకుని రెడీ అయిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని అనుకోనేలేదు. ఈసారి అలా ప్యాడ్స్ కట్టుకోవద్దని బ్రావోకి చెబుతా..' అని ధోనీ చమత్కరించాడు.

చెన్నై అభిమానుల్ని కలుసుకోవాలని
ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సూపర్ కింగ్స్ జట్టు సోమవారం చెన్నైకి వెళ్లనుంది. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానుల్ని కలుసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ధోనీ చెప్పాడు. కావేరీ ఆందోళనల నేపథ్యంలో సీఎస్‌కే హోం గ్రౌండ్ చెన్నై నుంచి పుణెకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ బౌలర్లు రషీద్, భువీలపై ధోనీ ప్రశంసలు కురిపించాడు.

రషీద్‌లాగే భువనేశ్వర్ కూడా చాలా తెలివైన బౌలర్
‘మిస్టరీ బౌలర్ రషీద్‌లాగే భువనేశ్వర్ కూడా చాలా తెలివైన బౌలర్. కాబట్టి ప్రత్యర్థి జట్టులో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. అయితే వాట్సన్ స్టన్నింగ్ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది' అని మిస్టర్ కూల్ వివరించాడు.


Click it and Unblock the Notifications
