
హైదరాబాద్: ఐపీఎల్ కోసం కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరమైన ఆండ్రీ రస్సెల్ తీవ్రమైన శిక్షణ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్డ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నట్లు ఆయనే పేర్కొన్నాడు. ప్రత్యేక కారణాల రీత్యా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడకపోయినప్పటికీ.. ఐపీఎల్ లో ఆడేందుకు అమితోత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 2018 ఐపీఎల్ 11వ సీజనుకు అన్ని రకాలుగా తాను సిద్ధమంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ప్రకటించాడు.
ఇటీవల జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఫిజియో ఎయిరాల్డ్ ఎడ్వర్డ్స్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఈ వెస్టిండీస్ క్రికెటర్ ఐపీఎల్‌కు తగిన రీతిలో ఫిట్‌నెస్ సాధించినట్లు తెలిపాడు. ప్రపంచంలో వేగంగా పరిగెత్తే వ్యక్తి ఉసేన్ బోల్ట్ అని మనందరికీ తెలిసిందే. అలాంటి బోల్ట్ ఫిజియో దగ్గర నేను ఇప్పుడు తర్ఫీదు పొందాను. దాదాపు బోల్ట్ స్థాయిలో ఫిట్‌నెస్ సాధించానంటూ రస్సెల్ చెప్పుకొచ్చాడు.
రస్సెల్ గురించి మాట్లాడిన ఫిట్‌నెస్ కోచ్ ఎవరాల్డ్.. ఎడ్వర్డ్స్ చాలా మంచి వ్యక్తి. కఠోరమైన శ్రమ చేయగలడు. అతను నెట్స్ లో అత్యుత్తమమైన శిక్షణ పొందుతున్నాడని కొనియాడాడు. ఒక గొప్ప ఆటగాడిగా, మంచి అథ్లెట్, వ్యక్తిగా తయారుకావాలంటే ముందుగా మనల్ని మనం నియంత్రించుకోవాలంటూ ఈ వెస్టిండీస్ ఆటగాడు చెప్పాడు. ఇక రెండు సార్లు ఛాంపియన్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు గురించి మాట్లాడుతూ.. ఈ సీజనులో జట్టుకు నాణ్యమైన యువ ఆటగాళ్లు దొరికినట్లు పేర్కొన్నాడు.
అందరూ సమష్టిగా రాణిస్తే తప్పకుండా విజయం సాధిస్తామని తెలిపాడు. కొత్త కెప్టెన్ దినేశ్ కార్తీక్‌తో కలిసి పనిచేయడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా నెట్స్‌లో రస్సెల్ ప్రాక్టీసు చేస్తున్న వీడియోను కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకుంది. మరోవైపు శుక్రవారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్ గాయం కారణంతో ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ కేకేఆర్ శిక్షణ క్యాంపుకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాల్గొననున్నాడు.