Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మిత్ కెరీర్‌లో ఇదే తొలిసారి.. ట్రెస్కోథిక్‌ రికార్డు మిస్!!

first time in Test career, Steve Smith ends a Test series not hitting a fifty

అడిలైడ్‌: పాకిస్థాన్‌తో ఇటీవల ముగిసిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మన్, ఆసీస్‌ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లోనూ స్మిత్ 40 పరుగులు మాత్రమే చేసాడు. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేసిన స్మిత్‌.. అడిలైడ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేశాడు. అయితే ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కేవలం రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడింది.

కెరీర్‌లో ఇదే తొలిసారి:

కెరీర్‌లో ఇదే తొలిసారి:

ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో విశేషంగా రాణించిన స్మిత్‌.. పాకిస్తాన్‌ సిరీస్‌లో మాత్రం విఫలమయ్యాడు. స్మిత్ తన టెస్ట్ అరంగేట్రం తర్వాత ఒక పాకిస్తాన్‌ సిరీస్‌లో మాత్రమే రాణించలేదు. అంతేకాదు టెస్టు కెరీర్‌ ఆరంభించిన తర్వాత ఒక సిరీస్‌లో కనీసం హాఫ్‌ సెంచరీ లేకుండా ముగించిన సిరీస్ కూడా ఇదే. దీంతో ఒక సిరీస్‌లో హాఫ్‌ సెంచరీ లేకుండా వస్తున్న స్మిత్‌కు ఫుల్‌స్టాప్‌ పడింది.

ట్రెస్కోథిక్‌ రికార్డు మిస్:

ట్రెస్కోథిక్‌ రికార్డు మిస్:

స్మిత్‌ ఇప్పటివరకు 21 టెస్టు సిరీస్‌లు ఆడాడు. అయితే పాకిస్తాన్‌తో సిరీస్‌లో హాఫ్‌ సెంచరీ సాధించకపోవడంతో.. స్మిత్‌ ఒక రికార్డును కోల్పోయాడు. ఇంగ్లండ్‌ మాజీ ఓపెనర్‌ మార్కస్‌ ట్రెస్కోథిక్‌ 23 వరుస టెస్టు సిరీస్‌ల్లో హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు స్మిత్ ఆ రికార్డును మిస్ అయ్యాడు. 70 టెస్టులు ఆడిన స్మిత్.. 27 హాఫ్‌ సెంచరీలు, 26 సెంచరీలతో 7,013 పరుగులు చేసాడు.

నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు:

నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు:

బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. యాషెష్ 2019తో మళ్లీ పునరాగమనం చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్ పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో రెండు శతకాలు, రెండో టెస్టులో అర్ధ సెంచరీ, నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీ, ఐదవ టెస్టులో అర్ధ సెంచరీతో సత్తాచాటాడు. యాషెస్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేయడంతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

బ్రాడ్‌మన్‌ను అధిగమించిన స్మిత్‌:

బ్రాడ్‌మన్‌ను అధిగమించిన స్మిత్‌:

ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో డాన్ బ్రాడ్‌మన్‌ను స్మిత్‌ అధిగమించాడు. బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 6,996 పరుగులు చేయగా.. స్మిత్‌ 70 టెస్టుల్లో 7,013 పరుగులు చేసాడు. టెస్ట్ ఫార్మాట్‌లో బ్రాడ్‌మన్ 29 సెంచరీలు చేయగా.. స్మిత్‌ 26 సెంచరీలు చేసాడు. బ్రాడ్‌మన్ సెంచరీలను అందుకోవడానికి స్మిత్‌ మూడు సెంచరీల దూరంలో నిలిచాడు.

Story first published: Tuesday, December 3, 2019, 12:31 [IST]
Other articles published on Dec 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+