Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

142 ఏళ్ల ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా స్టోక్స్‌ అరుదైన రికార్డు!!

First time in 142 years: Ben Stokes claims impressive Test record for England

కేప్‌టౌన్‌: ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్-2019 హీరో బెన్‌ స్టోక్స్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో స్టోక్స్‌ ఐదు క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లను అందుకున్న తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా (వికెట్‌ కీపర్లను మినహాయించి) రికార్డుల్లోకి ఎక్కాడు.

స్టోక్స్‌ సరికొత్త రికార్డు:

స్టోక్స్‌ సరికొత్త రికార్డు:

రెండో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎన్రిచ్ నోర్జే క్యాచ్ పట్టడం ద్వారా స్టోక్స్‌ ఐదు క్యాచ్‌లను అందుకున్నాడు. హమ్జా, డుప్లెసిస్‌, వాన్‌డెర్‌ డస్సెన్‌, ప్రిటోరియస్‌ క్యాచ్‌లను స్టోక్స్‌ పట్టుకున్నాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఒక ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఐదు క్యాచ్‌లను అందుకోవడం ఇదే తొలిసారి. 1877లో టెస్టు హోదా పొందిన ఇంగ్లండ్‌.. ఇప్పటివరకూ 1019 టెస్టులు ఆడింది. కానీ.. ఓ క్రికెటర్‌ ఐదు క్యాచ్‌లను అందుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది.

నాలుగు క్యాచ్‌లు.. 23సార్లు:

నాలుగు క్యాచ్‌లు.. 23సార్లు:

ఒక ఇన్నింగ్స్‌లో ఒక ఇంగ్లండ్‌ క్రికెటర్‌ నాలుగు క్యాచ్‌లను ఇప్పటివరకూ 23సార్లు అందుకున్నారు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ నాలుగు క్యాచ్‌లను చివరిసారి అందుకున్నాడు. తాజాగా స్టోక్స్‌ ఐదు క్యాచ్‌లను అందుకుని కొత్త చరిత్రను లిఖించాడు. స్టోక్స్‌ అన్ని క్యాచ్‌లు రెండో స్లిప్‌లోనే పట్టడం మరో విశేషం.

ఐదు వికెట్లతో అండర్సన్‌ విజృంభణ:

ఐదు వికెట్లతో అండర్సన్‌ విజృంభణ:

తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 89 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్‌ అండర్సన్‌ ఐదు వికెట్లతో సత్తాచాటగా.. స్టువర్ట్‌ బ్రాడ్‌, సామ్‌ కర్రాన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 269 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్‌:

భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్‌:

రెండో టెస్టులో ఇప్పటికే ఇంగ్లండ్‌ పట్టుబిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డామ్ సిబ్లీ (85 బ్యాటింగ్‌; 13 ఫోర్లు), కెప్టెన్ జో రూట్‌ (61; 7 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో... ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న రూట్ సేన ఓవరాల్‌గా 264 పరుగుల ఆధిక్యంలో ఉంది. సఫారీ బౌలర్లలో నోర్జేకు 2 వికెట్లు దక్కాయి.

Story first published: Monday, January 6, 2020, 10:32 [IST]
Other articles published on Jan 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+