
హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ భారత క్రీడాకారులకు ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి. మరో రెండు రోజుల్లో అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న ఈ సిరీస్‌కు ఇప్పటికే ఆటగాళ్లు సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండియాకు పలు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు.
'సఫారీ గడ్డపై టీమిండియా జగ్రత్తగా ఆడాలి. జట్టు బాగా రాణిస్తే కోహ్లీ సేనకు విజయం సొంతం అవుతోంది. ఈ పర్యటనలో ఏ ఒక్కరిపై ఆధారపడకుండా జట్టు సభ్యులంతా రాణించాలి. కోహ్లీ తన ఆట తాను ఆడుకుంటే చాలు. భారీ స్కోర్లు నమోదు చేయడం చాలా ముఖ్యం. ఏ టెస్టులో అయినా తొలి రోజు ఆటే కీలకం. తొలి రోజు మొదటి స్పెల్‌లో అటు బ్యాట్‌తో.. లేదంటే బంతితోనైనా ఎవరు రాణిస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి' అని సచిన్ వివరించాడు.
'నా 24 ఏళ్ల టెస్టు క్రికెట్ కెరీర్‌లో భారత జట్టు ప్రస్తుతం ఉన్నంత బలంగా ఎప్పుడూ లేదు. అటు బౌలింగ్‌లో.. ఇటు బ్యాటింగ్‌లో రెండు విభాగాల్లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య ఈ పర్యటనలో భారత జట్టుకు దొరికిన అదనపు బలం. కోహ్లీకి దొరికిన ఆయుధం కూడా పాండ్యనే. పాండ్య 17 నుంచి 18 ఓవర్లు సునాయాసంగా వేయించగలడు. 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు చేయగలడు.
దక్షిణాఫ్రికా పర్యటన పాండ్యకు అసలైన పెద్ద సిరీస్. సీమర్‌గా..మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా, ఫీల్డర్‌గా పాండ్య గొప్పగా రాణిస్తున్నాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం గురించి ఎప్పుడూ ఆలోచన కూడా జరగలేదు. కపిల్ దేవ్ హయాంలోనూ ఇది లేదు. అక్కడి పిచ్‌లపై బంతులు మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో దూసుకొస్తాయి. కాబట్టి స్లిప్ ఫీల్డింగ్ చాలా బలంగా ఉండాలి.
దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా ఇద్దరూ కీలకమైన ఆటగాళ్లు. వీరిద్దరి వికెట్లు ఎంత త్వరగా దక్కించుకుంటే అంత సులువుగా భారత్ తాను అనుకున్న పని చేయగలదు. కలీస్, గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్ లాంటి ఆటగాళ్లు లేరనే నిరాశతో ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఉంది' అని సచిన్ వివరించాడు.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జనవరి 5న కేప్‌టౌన్‌లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.