రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?

హైదరాబాద్: ప్రస్తుతం పరిమిత ఓవర్ల హవా నడుస్తున్నా.. ఒకప్పుడు మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌ చూసేందుకే ఆసక్తి చూపేవారు. బ్యాట్స్‌మెన్‌, బౌలర్ సత్తాని టెస్ట్ మ్యాచులే తేల్చేవి. రసవత్తర పోరులో ఎన్నో మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు అలరించేవి. ఏకపక్షంగా సాగే మ్యాచ్‌లు నాలుగు లేదా మూడు రోజుల్లో ఫలితాలు వచ్చేవి. తాజాగా నరేంద్ర మోడీ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన డేనైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. టాప్ జట్లు రెండు రోజుల్లోనే ప్యాకప్‌ చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పటివరకూ ఎన్ని టెస్టులు ఇలా రెండు రోజుల్లోనే ముగిశాయో ఓసారి చూద్దాం.

ఇంగ్లండ్ అత్యధికంగా 13 సార్లు

ఇంగ్లండ్ అత్యధికంగా 13 సార్లు

అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభం అయినప్పటినుంచి ఈరోజు వరకు మొత్తం 2412 టెస్టులు జరిగాయి. అందులో 22 మ్యాచ్‌లు కేవలం రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్ అత్యధికంగా 13 సార్లు రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌ల్లో భాగస్వామిగా నిలిచింది. అందులో 9 సార్లు విజయం సాధించగా.. 4 సార్లు ఓటమి చవిచూసింది. ఇక ఆధునిక క్రికెట్‌లో 2000 తర్వాత మొత్తం ఏడు టెస్టులు రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. ఇంగ్లండ్ రెండుసార్లు తలపడగా ఒకటి విజయం సాధించి, మరొకటి ఓటమిపాలైంది. ఈ ఏడు టెస్టుల్లో జింబాబ్వే అత్యధికంగా మూడు సార్లు పాలుపంచుకుంది. భారత్‌, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు రెండు మ్యాచ్‌లు ఆడాయి.

1882లో తొలిసారి

1882లో తొలిసారి

19వ శతాబ్దంలో టెస్టు క్రికెట్ ప్రారంభం అయింది. అప్పట్లోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడేవి. దాంతో కొన్ని మ్యాచ్‌లు ఐదు రోజులు జరిగేవి, మరికొన్ని మ్యాచ్‌లు తక్కువ రోజులు జరిగేవి. అయితే 1882లో తొలిసారి ఓ టెస్టు మ్యాచ్‌ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. అప్పుడు ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1888లో మరోసారి తలపడిన సందర్భంలోనూ ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయితే ఇంగ్లండ్‌ అదే ఏడాది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ను చిత్తు చేసింది. 1889లోనూ మరో రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. 1890లో ఆస్ట్రేలియాపై మరోసారి, 1896లో దక్షిణాఫ్రికాపై రెండుసార్లు రెండు రోజుల్లోనే పని పూర్తి చేసింది.

చివరగా జరిగిన రెండు టెస్టుల్లో భారత్

చివరగా జరిగిన రెండు టెస్టుల్లో భారత్

ఆ తర్వాత పూర్తయిన రెండు రోజుల టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయాలు అందుకుంది. 1912లో దక్షిణాఫ్రికాపై.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చెరో విజయం సాధించాయి. 1921, 1931, 1936, 1946లో ఆసీస్.. వరుసగా ఇంగ్లండ్, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లపై ఆధిపత్యం చెలాయించింది. 1946 తర్వాత మళ్లీ రెండు రోజుల్లోనే ఓ టెస్టు మ్యాచ్‌ ఫలితం తేలింది 2000 సంవత్సరంలోనే. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. 2002లో పాకిస్థాన్‌పై ఆసీస్‌, 2005లో జింబాబ్వేపై.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ గెలుపొందాయి. మళ్లీ 12 ఏళ్ల తర్వాత.. 2017లో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా విజయం అందుకుంది. ఇక చివరగా జరిగిన రెండు టెస్టుల్లోనూ భారత్‌ విజేతగా నిలిచింది. 2018లో అఫ్గానిస్థాన్‌పై, 2021లో ఇంగ్లండ్‌పై భారత్ విజయాలు సాధించింది.

PinkBall Test: భారత థర్డ్ అంపైర్‌పై జో రూట్ ఫిర్యాదు!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, February 26, 2021, 15:27 [IST]
Other articles published on Feb 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X