
జాగ్రత్తగా ఆడకుండా మంచి షాట్స్‌ను కొట్టగలిగా
అద్భుతమైన బౌండరీలతో చివరివరకూ కొనసాగి జట్టుకు విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది 84 పరుగులు సాధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ... ‘నేను చేసిన హాఫ్ సెంచరీల్లో నాకు నిజంగా తృప్తినిచ్చిన మొదటి అర్ధ శతకం ఇదే. జట్టును గెలిపించడం కోసం చివరి వరకూ ఆడాను. ఐపీఎల్ నా ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇంకా బాగా రాణించి మా జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని భావిస్తున్నాను. నాపై నేను నమ్మకం ఉంచడం వల్లే ఇంత బాగా ఆడగలిగాను. అందుకే మరీ జాగ్రత్తగా ఆడకుండా మంచి షాట్స్‌ను కొట్టగలిగాను. టి20ల్లోనూ బాగా రాణిస్తాననే నమ్మకం కలిగింద'ని అన్నాడు.

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ 50:
ఈ సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ 50 నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్ కంటే రాజస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్సే అత్యుత్తమమని కేఎల్ రాహుల్ చెప్పాడు. వ్యక్తిగతంగా నాకు నిజంగా సంతృప్తి కలిగించిన ఇన్నింగ్స్ ఇదేనని మ్యాచ్ అనంతరం ఈ పంజాబ్ ఓపెనర్ చెప్పాడు. చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును గెలిపించడం ఆనందంగా ఉందన్నాడు.

2016లో ముంబై ఇండియన్స్‌పై 68:
రాజస్థాన్‌పై ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేసిన రాహుల్ (84*)కు ఐపీఎల్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు కావడం గమనార్హం. ఈ సీజన్లో కోల్‌కతాపై 60 రన్స్ చేసిన కేఎల్.. 2016లో ముంబై ఇండియన్స్‌పై 68 పరుగులు చేశాడు.

నాకు జతగా ఎవరైనా ఉంటే బాగుండు:
అదేవిధంగా ఈ మ్యాచ్‌లో తనకు మద్దతుగా నిలిచిన బ్యాట్సమెన్ నాయర్, స్టోనిస్‌లకు గురించి చెబుతూ.. ‘నాకు జతగా ఎవరైనా ఉంటే బాగుండు అన్పించింది. ఆ విషయంలో కరుణ్, స్టోనిస్‌లు చాలా బాగా తోడ్పడ్డారు. వారు కూడా మంచి స్కోరు సాధించార'ని అన్నాడు. రాహుల్‌కు జతగా కరుణ్ నాయర్(31), స్టోనిస్(23 నాటౌట్)లు ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications












