For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022లో ఫస్ట్ హ్యాట్రిక్ - అదీ ఓ అనామక బౌలర్ పేరు మీద..!!

First Hat trick in T20 World Cup 2022: UAE Bowler Karthik Meiyappan registr against Sri Lanka

హోబర్ట్: టీ20 ప్రపంచ కప్ 2022లో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదవుతున్నాయి. తొలి రెండు రోజుల్లోనూ అద్భుతాలు చోటు చేసుకున్నాయి. మూడో రోజు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఇవ్వాళ కూడా ఓ అద్భుతం కనిపించిందీ టోర్నమెంట్‌లో. తొలి రోజు ఓపెనింగ్ మ్యాచ్‌లోనే నమీబియా చేతిలో శ్రీలంక ఘోరంగా ఓడిపోయింది. ఆ మరుసటి రోజే స్కాట్లాండ్.. వెస్టిండీస్‌ను మట్టి కరిపించింది. అదే సమయంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వామప్ మ్యాచ్ సైతం నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసింది అభిమానులకు.

 శ్రీలంకపై..

శ్రీలంకపై..

ఇవ్వాళ హ్యాట్రిక్ నమోదైంది. శ్రీలంక-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన సంభవించింది. యూఏఈ బౌలర్ కార్తీక్ మెయప్పన్ హ్యాట్రిక్ సాధించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ 2022లో ఇదే మొట్టమొదటి హ్యాట్రిక్. ఓ అనామక బౌలర్‌ ఈ ఘనతను సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను నేలకూల్చాడు కార్తీక్ మెయప్పన్. దీనితో శ్రీలంక కష్టాల్లో పడింది.

కుప్పకూలిన లంక బ్యాటింగ్..

కుప్పకూలిన లంక బ్యాటింగ్..

ఈ మధ్యాహ్నం హోబర్ట్ స్టేడియంలో ఆరంభమైన గ్రూప్ దశ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించుకున్న శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్.. ఆ తరువాత కుప్పకూలిపోయింది. యుఏఈ బౌలర్లకు దాసోహం అయింది. ప్రత్యేకించి- కార్తీక్ మెయప్పన్.. తన బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు. జహూర్ ఖాన్ అతనికి తోడయ్యాడు. ఓపెనర్లు, టప్ ఆర్డర్ బ్యాటర్ మినహా మరెవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. సింగిల్ డిజిట్ స్కోర్‌ కూడా చేయలేకపోయారు.

హ్యాట్రిక్ ఇలా..

హ్యాట్రిక్ ఇలా..

15వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు కార్తీక్. ఆ ఓవర్ చివరి మూడు బంతులకూ ముగ్గురు బ్యాటర్లను బలి తీసుకున్నాడు. తన స్పిన్ మాయాజాలంలో పడేశాడు. నాలుగో బంతికి భానుక రాజపక్స, అయిదో బంతికి చరిత్ అసలంక, ఆరో బంతికి డాసన్ శనక పెవిలియన్ దారి పట్టారు. స్టంప్స్‌కు కాస్త దూరంగా వెళ్తోన్న బంతిని ఆఫ్ సైడ్ ఆడబోయిన భానుక రాజపక్స్ టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి లేచిన బంతిని కశీఫ్ దౌడ్ అందుకున్నాడు. అయిదు పరుగులు మాత్రమే చేశాడు భానుక.

గూగ్లీకి బలి..

గూగ్లీకి బలి..

అయిదో బంతికి చరిత్ అసలంక బలి అయ్యాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో గూగ్లీగా సంధించిన బంతి- చరిత అసలంక బ్యాట్‌ను ముద్దాడుతూ నేరుగా వెళ్లి వికెట్ కీపర్ అరవింద్ చేతుల్లో వాలింది. ఆరో బంతికి కేప్టెన్ డాసన్ శనక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మళ్లీ గూగ్లీని వేశాడు కార్తీక్. ఆ బంతిని ఎలా ఆడాలో శనక అర్థం చేసుకునేలోపే వికెట్లను గిరాటేసింది. దీనితో ఈ వరల్డ్ కప్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేసిన మొదటి బౌలర్‌గా రికార్డులకెక్కాడు కార్తీక్ మెయప్పన్.

152 పరుగులే..

తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో ఘోరంగా ఓడిన శ్రీలంక.. రెండో మ్యాచ్‌లోనైనా తేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్లను కోల్పోయి 152 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ పాథుమ్ నిశ్శంక ఒక్కడే టాప్ స్కోరర్. 74 పరుగులు చేశాడు పాథుమ్. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్-18, ధనంజయ డిసిల్వా-33 పరుగులు చేశారు. ఇక అంతే. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లెవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.

ఎవరీ కార్తీక్..

ఎవరీ కార్తీక్..

కార్తీక్ మెయప్పన్ పూర్తిపేరు.. కార్తీక్ పళనియపన్ మెయప్పన్. తమిళనాడుకు చెందిన క్రికెటర్. 2000 అక్టోబర్ 8వ తేదీన చెన్నైలో జన్మించాడు. కుడిచేతి వాటం లెగ్ బ్రేక్ బౌలర్. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం పెద్దగా లేదు. ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు, డజను టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. వన్డేల్లో 10, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 18 వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ వన్డేల్లో 4/37, టీ20ల్లో 4/25.

Story first published: Tuesday, October 18, 2022, 15:50 [IST]
Other articles published on Oct 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+