తొలి శ్రీలంక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన స్పిన్ లెజెండ్ ముత్తయ్య
కొలంబో: స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ పేమ్‌కు ఎంపికైన తొలి శ్రీలంక క్రికెటర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రపంచ క్రికెట్‌లో 800 వికెట్లు తీసుకున్న ముత్తయ్యకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పిస్తున్నట్లు బుధవారం ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది ముత్తయ్యతో పాటు మరో ముగ్గురు క్రికెటర్లకు ఈ ఘనత దక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆర్ధర్ మెర్రిస్‌తో పాటు ఆసీస్‌కు రెండు ఉమెన్స్ వరల్డ్ కప్(1997, 2005)లు అందించిన కరీన్ రోల్టన్, ఇంగ్లాండ్‌కు చెందిన జార్జి లోహ్‌మ్యాన్‌లకు ఏడాది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది.

తొలి శ్రీలంక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన స్పిన్ లెజెండ్ ముత్తయ్య
హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఈ నలుగురు క్రికెటర్లను ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డసన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్‌కు విశిష్టమైన సేవలు అందించడంతో పాటు క్రికెట్‌లో చరిత్రను సృష్టించిన ఆటగాళ్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

మోడ్రన్ క్రికెట్‌లో ముత్తయ్య మురళీధరన్ అత్యుత్తమ ఆటగాడని ఆయన చెప్పారు. టెస్టులు, వన్డేల్లో శ్రీలంక జట్టు రాణించడానికి ముత్తయ్య ఎనలేని సేవలు అందించాడని ఆయన ప్రశంసించారు. 2011లో ముంబైలో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అనంతరం ముత్తయ్య అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్లు తీసుకోగా, వన్డేల్లో 534 వికెట్లు తీసుకున్నారు. తన క్రికెట్ కెరీర్‌లో కేవలం 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన ముత్తయ్య 13 వికెట్లను తీసుకున్నారు. టెస్టు క్రికెట్లో 10 వికెట్లను 22 సార్లు తీసుకున్న ముత్తయ్య, 5 వికెట్లను 67 సార్లు తీసుకోవడం విశేషం.

తొలి శ్రీలంక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన స్పిన్ లెజెండ్ ముత్తయ్య
1993 నుంచి 2011 మధ్య కాలంలో శ్రీలంక జట్టు సాధించిన అద్భుతమైన విజయాల్లో ముత్తయ్య అందించిన సేవలు అమోఘం. 1996లో శ్రీలంక జట్టు ఐసీసీ వరల్డ్ కప్‌ను సాధించడంలో ముత్తయ్య కీలక పాత్ర పోషించారు. ఇక 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో శ్రీలంక ట్రోఫీని కైవసం చేసుకున్న జట్టులో ముత్యయ్య ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications