Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి బంతికే ఆసీస్ వికెట్ పడగొట్టిన ఖలీల్

India vs Australia 1st T20I : Khaleel Ahmed Removes D'Arcy Short Off His First Ball| Oneindia Telugu
first ball first wicket out by khaleel ahmed

హైదరాబాద్: బ్రిస్బేన్‌లోని ది గబ్బా వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియాల తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు మరుపురాని అనుభవం ఎదురైంది. భారత బౌలర్ ఖలీల్ అహ్మద్.. వేసిన తొలి బంతికే తొలి వికెట్‌ను తీశాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేసిన నాలుగో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ డార్సీ షార్ట్‌ షాట్ కొడదామని ప్రయత్నించి కుల్దీప్‌ క్యాచ్‌ పట్టడంతో ఔట్ అయ్యాడు. 12బంతులు ఆడిన షార్ట్ 7పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.

డార్సీ షార్ట్ ఔట్ కావడంతో క్రిస్ లీన్ క్రీజులోకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 31పరుగులు చేసింది. ఫించ్, లీన్ బ్యాటింగ్ చేస్తున్నారు.

1
43620

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. తన బౌన్సర్లతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు భువీ. ఇలా 2 ఓవర్లు ముగిసే సరికి కేవలం ఆస్ట్రేలియా 5పరుగులు మాత్రమే చేయగలిగింది.

తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ పరిస్థితులు బౌలింగ్‌కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు ముందుగా టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ అన్నాడు. ఆసీస్ గడ్డపై మొత్తం మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌తో ఆసీస్ గడ్డపై సుదీర్ఘ పర్యటనకు టీమిండియా శ్రీకారం చుట్టబోతోంది.

Story first published: Wednesday, November 21, 2018, 14:15 [IST]
Other articles published on Nov 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+