For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

25 ఏళ్ల తర్వాత తొలిసారి: సఫారీ గడ్డపై కోహ్లీ సరికొత్త రికార్డు

By Nageshwara Rao

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటికే తనపేరిట ఎన్నో రికార్డులను లిఖించాడు. తాజాగా గత 25 ఏళ్లుగా సపారీ గడ్డపై ఏ కెప్టెన్ కూడా సాధించలేని ఓ అరుదైన రికార్డుని విరాట్ కోహ్లీ సాధించాడు. సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ ఈ రికార్డు నెలకొల్పాడు. 1992లో టీమిండియా తొలిసారి సఫారీ గడ్డపై ద్వైపాక్షిక సిరిస్ ఆడేందుకు అడుగుపెట్టింది. తాజా పర్యటన కాకుండా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆరు సార్లు వెళ్లింది. అయితే ఈ ఆరు సార్లలో సఫారీ గడ్డపై భారత జట్టు అటు టెస్టు సిరిస్‌తో పాటు ఇటు వన్డే సిరిస్‌ను గెలుచుకోవడంలో విఫలమైంది.

India vs South Africa : How India Crush South Africa by 9 Wickets
 వరుసగా రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం

వరుసగా రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం

స్వదేశంలో వరుస విజయాలను నమోదు చేసిన కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై చరిత్ర సృష్టిస్తుందని అందరూ భావించారు. అయితే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో చేజార్చుకుని అభిమానులను నిరాశకు గురి చేసింది. టెస్టు సిరిస్ అనంతరం దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల సిరిస్‌లో తలపడుతుంది. వన్డే సిరిస్ అనంతరం మూడు టీ20 సిరిస్ ఆడనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో టీమిండియా ఘన విజయం సాధించింది.

సఫారీ గడ్డపై కోహ్లీ తొలి సెంచరీ

సఫారీ గడ్డపై కోహ్లీ తొలి సెంచరీ

అయితే గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ దూరమవ్వడం, తొలి వన్డేలో ఆడిన ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ గాయం కారణంగా సిరిస్ నుంచే తప్పుకోవడం భారత్‌కు కలిసొచ్చింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో వన్డేల్లో 33వ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు సఫారీ గడ్డపై కోహ్లీకి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక, సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్పిన్నర్లు చాహల్ (5/22), కుల్దీప్ (3/20)లు సఫారీల నడ్డి విరిచారు.

 118 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్

118 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్

వీరిద్దరూ ఎనిమిది వికెట్లు తీయడంతో పాటు కేవలం 42 పరుగులు మాత్రమే ఇవ్వడంతో దక్షిణాఫ్రికా 118 పరుగులకే కుప్పకూలింది. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. ఇలా ఆరు వన్డేల సిరిస్‌లో తొలి రెండు వన్డేల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా టీమిండియా ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. సఫారీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో వరుసగా రెండు వన్డేలను గెలవడం ఇది రెండోసారి. అంతకముందు జనవరి 2011లో ఇలా జరిగింది. ధోని నేతృత్వంలోని టీమిండియా 2011 సఫారీ పర్యటనలో జోహెన్స్ బర్గ్‌లో జరిగిన వన్డేలో ఒక పరుగు తేడాతో విజయం సాధించగా, ఆ తర్వాత కేప్ టౌన్ వేదికగా జరిగిన వన్డేలో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 ధోని రికార్డుని సమం చేసిన కోహ్లీ

ధోని రికార్డుని సమం చేసిన కోహ్లీ

దీంతో ద్వైపాక్షిక సిరిస్‌లో ధోని నెలకొల్పిన రికార్డుని కెప్టెన్‌గా కోహ్లీ సమం చేశాడు. అంతేకాదు సఫారీ గడ్డపై వరుసగా మూడు విజయాలను నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన కోహ్లీసేన మూడో టెస్టులో 63 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో కూడా కోహ్లీసేన విజయాలను నమోదు చేయడం చూశాం.

 సఫారీ గడ్డపై భారత్ సాధించిన విజయాలు

సఫారీ గడ్డపై భారత్ సాధించిన విజయాలు

ద్వైపాక్షిక సిరిస్‌లో సఫారీ గడ్డపై భారత హ్యాట్రిక్ విజయాలు:

* 3rd Test (January 24-27, 2018) - Won by 63 runs in Johannesburg

* 1st ODI (February 1, 2018) - Won by six wickets in Durban

* 2nd ODI (February 4, 2018) - Won by nine wickets in Centurion

ద్వైపాక్షిక సిరిస్‌లో సఫారీ గడ్డపై భారత్ రెండు వరుస విజయాలు:

* January 15, 2011 - Won by one run in Johannesburg

* January 18, 2011 - Won by two wickets in Cape Town

Story first published: Monday, February 5, 2018, 13:33 [IST]
Other articles published on Feb 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+