క్రికెట్‌ల అప్పుడప్పుడూ ఫన్నీ ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అమెరికా వేదికగా మొదలైన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ లీగ్‌లో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సియాటెల్ ఆర్కాస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూనికార్న్స్ స్టార్ బ్యాటర్, ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడే ఫిన్ అలెన్ అవుటైన విధానం పెద్ద కామెడీ సీన్‌ను తలపించింది.
కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేసిన అలెన్.. రనౌట్ అయ్యాడు. లేజీగా పరుగు పూర్తి చేసేందుకు ప్రయత్నించిన అతను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీంతో బ్యాటు పిచ్‌పై జారలేదు. అది అలా స్టక్ అవడంతో తడబడిన అతను రనౌట్ అయ్యాడు. సియాటెల్ ఆల్‌రౌండర్ కామెరూన్ గానన్ వేసిన బంతిని మిడ్ వికెట్ వైపుగా అలెన్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షెహన్ జయసూరియకు ఈ బంతి దూరంగా వెళ్లింది.

ఇది గమనించిన అలెన్ నెమ్మదిగా సింగిల్ పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే మంచి అలెర్ట్‌గా ఉన్న జయసూరియ.. బంతిని నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అతను అలా రియాక్ట్ అవడం చూసిన అలెన్ సడెన్‌గా వేగం పెంచి పరుగు పూర్తిచేయబోయాడు. సరిగ్గా అప్పుడే అతని చేతిలోని బ్యాటు నేలకు తగిలి స్టక్ అయింది. దీంతో అలెన్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. గతంలో మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఇలాగే అవుటైన సంగతి తెలిసిందే.
ఇదంతా కామెంటరీ బాక్సులో నుంచి చూసిన అలన్ వికిన్స్.. ఈ అవుట్ సీనంతా కామెడీగా ఉందన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 178 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన శాన్‌ఫ్రాన్సిస్కో జట్టు బ్యాటర్లు అందరూ ఇలాగే తడబడ్డారు. దీంతో ఆ టీం 17.5 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు సియాటెల్ టీం ప్లేయర్ హెన్రిక్ క్లాసెన్ (53) రాణించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.