
అశ్విన్‌కు గాయం
తొలి వన్డేలో భారత్ ఓటమికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. జట్టులోని అత్యుత్తమ స్పిన్నర్ అశ్విన్ మధ్యలోనే గాయమై వెళ్లిపోవడం తొలి దెబ్బ. అశ్విన్ ఉచ్చులో సౌతాఫ్రికా ఆటగాళ్లు చిక్కుకుంటున్న సమయంలో అతను అనూహ్యంగా మైదానం వదలవలసి వచ్చింది.తన తొలి ఓవర్లోనే డికాక్‌ను అవుట్ చేసిన అశ్విన్.... మళ్లీ డివిల్లీయర్స్ వచ్చాక తిరిగి బౌలింగ్ ఇచ్చాడు ధోనీ. ఐదో తన నాలుగో ఓవర్లో బంతిని ఆపడానికి అశ్విన్ కిందపడగా.. పక్కటెములకు గాయమైంది. అప్పుడు మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి ఓ ఓవర్ వేసే ప్రయత్నం చేశాడు. నాలుగు బంతులు వేసేసరికి గాయం ఎక్కువైంది. అతను సిరీస్‌కే దూరం అయ్యే అవకాశాలున్నాయి. అతని స్థానంలో భజ్జీని సెలక్ట్ చేశారు.

రెచ్చిపోయిన తాహిర్
ఇమ్రాన్ తాహిర్ చివర్లో రెచ్చిపోయాడు. భారత్ 24 బంతుల్లో 35 పరుగులు చేయవలసి ఉన్న సమయంలో... చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. అలాంటి స్థితిలో 150 పరుగులతో దూకుడుగా ఉన్న రోహిత్ శర్మను తన ఓవర్లో (47వ ఓవర్) అవుట్ చేశాడు. తర్వాత సురేష్ రైనాను అవుట్ చేశాడు.

చివరి ఆరు ఓవర్లలో సౌతాఫ్రికా దూకుడు
44 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 217 పరుగులతో ఉంది. అయితే, ఆ చివరి ఆరు ఓవర్లలోనే 86 పరుగులు చేసింది. దీంతో, 50 ఓవర్లు ముగిసే సరికి... 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.

డివిల్లియర్స్ దూకుడు
ఏబీ డివిల్లీయర్స్ దూకుడుగా ఆడాడు. అతను 73 బంతుల్లో 104 పరుగులు చేశాడు. డివిలియర్స్ జోరందుకోవడంతో ఇన్నింగ్స్ గమనమే మారిపోయింది. అప్పటిదాకా కట్టుదిట్టంగా బంతులేసిన బౌలర్లందరూ పట్టుతప్పారు.చివరి ఆరు ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరుకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. తొలి 30 బంతుల్లో 18 పరుగులే చేసిన ఏబీ.. చివరి ఓవర్లలో భారత బౌలింగ్‌ను ఊచకోత కోసి శతకం పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక శతకాలు చేసిన ఆమ్లా, గిబ్స్‌లను సమం చేశాడు. కెప్టెన్‌గా అతడికిది 10వ శతకం. పాంటింగ్ (22), గంగూలీ (11), జయసూర్య (10) మాత్రమే కెప్టెన్సీలో 10 అంతకంటే ఎక్కువ శతకాలు సాధించారు.

కాగిసో రబడ
ఇరవై ఏళ్ల వయస్సు ఉన్న సౌతాఫ్రికా బౌలర్ రబడ ముందు బెస్ట్ ఫినిషర్ అయిన ధోనీ చేతులెత్తేశాడు. రబడకు ఇది ఆరో వన్డేనే. ఈ వన్డేలో తొలి 9 ఓవర్లలో వికెట్ తీయకుండా 53 పరుగులిచ్చాడు. ఇలాంటి బౌలర్‌కు చివరి ఓవర్లో 11 పరుగుల్ని కాపాడే బాధ్యత అప్పగించాడు కెప్టెన్ ఏబీ డివిల్లీయర్స్.రబడ బౌలింగులో... తొలి బంతికి కష్టం మీద రెండు పరుగులు రాబట్టిన ధోని, రెండో బంతికి సింగిలే తీశాడు. మూడో బంతికి బిన్నీ ఒక పరుగు చేయడంతో మళ్లీ ధోని స్త్ట్రెకింగ్‌కు వచ్చాడు. ధోని భారీ షాట్‌కు ప్రయత్నిస్తే బంతి బ్యాట్ అంచుకు తాకి అక్కడే గాల్లోకి లేచి రబడ చేతుల్లో పడింది.


Click it and Unblock the Notifications











