'ఫింగర్ స్పిన్నర్లూ వన్డేల్లో రాణించాలంటే మెరుగవ్వాల్సిందే'

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి వరల్డ్ కప్ జట్టులో ఎంపికయ్యే అవకాశాలు ఇంకా ఉన్నాయని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గత ఏడాదిన్నర కాలంగా చైనామన్ స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు టెస్టులకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఫింగర్ స్పిన్నర్లకు ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉన్నప్పటికీ జట్టులో కొనసాగేందుకు మరింతగా మెరుగవ్వాలని భజ్జీ సూచించాడు.

భజ్జీ మాట్లాడుతూ
భజ్జీ మాట్లాడుతూ "ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017ను పరిశీలిస్తే ఇంగ్లాండ్‌లో వాతావరణం వేడిగా, తేమ ఎక్కువగా ఉంది. అక్కడి పరిస్థితులు అలాగే ఉండి ప్రత్యర్థి జట్టులో ఐదారుగురు కుడిచేతి వాటం ఆటగాళ్లుంటే జడేజాకు అవకాశం ఉంటుంది. జడేజా, పాండ్యా ఆరు, ఏడో స్థానాల్లో ఆడాలి. ఇక జడేజా అద్భుతమైన ఫీల్డర్ అన్న సంగతి తెలిసిందే" అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

స్పిన్నర్లు మూడు రకాలుగా బౌలింగ్ చేస్తారు
"మణికట్టు స్పిన్నర్లు మూడు రకాలుగా బౌలింగ్ చేస్తారు. లెగ్ బ్రేక్, గూగ్లీ, ఫ్లిప్పర్. వన్డేలో అరుదుగా ఉపయోగించే టాప్ స్పిన్నర్‌ను కలుపుకుంటే నాలుగు అవుతాయి. ఇక ఆఫ్ స్పిన్నర్ విషయానికి వస్తే.. దూస్రా విసరలేకుంటే బౌలర్ ఆఫ్‌బ్రేక్‌లను బ్యాట్స్‌మన్ ముందుగానే అంచనా వేస్తాడు" అని భజ్జీ పేర్కొన్నాడు.

లియాన్‌కు సైతం వన్డేల్లో ఇబ్బంది
"అందుకే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ సైతం వన్డేల్లో ఇబ్బంది పడుతున్నాడు. ఇక, క్రీజులో ఉన్న ఆటగాళ్లు మణికట్టు స్పిన్నర్ల చేతి కదలికలను కాకుండా పిచ్ మీద పడిన తర్వాత బంతిని గమనిస్తే చాలా ప్రమాదం. ఈ కనికట్టు తెలియకే విదేశీ ఆటగాళ్లు మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నారు" అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.

స్పిన్నర్లను రోహిత్, ధావన్ ఆడుకుంటారు
"ఈ మణికట్టు స్పిన్నర్లను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అయితే స్పిన్‌లో చితకబాదుతారు. రోహిత్ ఐపీఎల్‌లో కుల్దీప్ బౌలింగ్‌కు ఇబ్బంది పడ్డా వన్డేల్లో మాత్రం ఆడగలడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అయితే స్పిన్ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడగలడు. కేదార్‌ది తక్కువ బౌన్స్, సైడ్ ఆర్మ్ బౌలింగ్ కావడంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడతారు" అని హార్భజన్ వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications