
హైదరాబాద్: శ్రీలంకతో ఫిబ్రవరి 8న ఢాకాలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూరమయ్యాడు. ముక్కోణపు వన్డే సిరీస్ సందర్భంగా లంకతో ఫైనల్లో షకిబ్ చేతి వేలికి గాయమైంది. దీంతో షకీబ్‌కు ప్రత్యామ్నాయంగా మహ్మదుల్లాహ్‌ను కెప్టెన్‌గా ఉంచనున్నారు.
42వ ఓవర్లో దినేశ్ చండీమల్‌ను రన్ అవుట్ చేసే ప్రయత్నంలో షకీబ్ వేలికి గాయమైంది. అయితే షకిబ్ వేలికి ఎక్స్‌రే తీయించారు. గాయం మరీ తీవ్రమైంది కాదని తేలడంతో కొన్ని కుట్లు వేశారు.
షకీబ్‌కు బదులుగా మహమ్మదుల్లాహ్ డిసెంబరులో బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా జనవరి 31వ తేదీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. రెండో టెస్టు ఫిబ్రవరి 8వ తేదీ జరగనుంది. వరుసగా రెండు టెస్టులు చిత్తగాంగ్, మీర్‌పూర్‌లో జరగనున్నాయి.
మొదటి టెస్టు ఆడబోయే బంగ్లాదేశ్ జట్టు:
* Mahmudullah (capt)
* Tamim Iqbal
* Liton Das
* Mushfiqur Rahim
* Imrul Kayes
* Mominul Haque
* Mosaddek Hossain
* Taijul Islam
* Mustafizur Rahman
* Kamrul Islam, Mehidy Hassan
* Rubel Hossain
* Nayeem Hasan
* Sunzamul Islam
* Tanbir Hayder
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.