For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహల్.. జాబు కోసం కళ్లజోడు కంటిన్యూ చేయాల్సిందే..

Find out why Yuzvendra Chahal wore glasses while fielding in 1st T20I vs South Africa

హైదరాబాద్: సఫారీ జట్టు పర్యటనలో అద్భుతంగా దూసుకుపోతోన్న భారత జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నారు సిన్నర్లు. సఫారీ గడ్డపై కుల్దీప్ యాదవ్, చాహల్‌ సంయుక్తంగా ఇప్పటికే 33 వికెట్లు పడగొట్టి భారత విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య మైదానంలో చాహల్ కళ్లజోడుతో కనిపిస్తున్నాడు.

ఇదేమైనా స్టైల్ కోసమా.. అంటే కాదంట. దీనిపై వివరణ కోసం ఇప్పటికే అభిమానులు తీవ్ర శోధన చేసినా ఫలితం రాలేదు. చివరికి ఈ విషయంపై చాహల్ తండ్రి వివరణ ఇచ్చారు. మంగళవారం చాహల్ తండ్రి కేకే చాహల్ మీడియాతో మాట్లాడుతూ.. 'దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే ముందు కంటి సంబంధిత వైద్యుల్ని చాహల్ సంప్రదించగా.. అప్పుడప్పుడు అద్దాలు ధరించాలని వారు సూచించారు.

పరీక్షల్లో అతనికేమీ కంటి చూపు లోపం ఎక్కువగా లేదని వైద్యులు తేల్చారు. కానీ.. త్వరలోనే ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న చాహల్‌‌.. ఉద్యోగ సంబంధిత వైద్య పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో ఈ పరీక్షల్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే అద్దాలు ధరిస్తే మంచిదని వైద్యులు సూచించారు.

ఈ కారణంగానే చాహల్ ఇప్పుడు మైదానంలో అద్దాలతో కనిపిస్తున్నాడు. అయితే.. బౌలింగ్, బ్యాటింగ్ సమయంలో వాటిని పక్కన పెడతాడు' అని చాహల్ తండ్రి కేకే చాహల్ వెల్లడించాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 బుధవారం రాత్రి జరగనుంది.

Story first published: Wednesday, February 21, 2018, 7:46 [IST]
Other articles published on Feb 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+