హైదరాబాద్: ఈ మధ్య కాలంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్‌లో పర్యటిస్తోంది.
ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలను ధావన్ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. తాజాగా ధావన్ ఓ సెల్పీని తీసుకుని దానికి ఫిల్టర్స్ యాడ్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ 'గుడ్ నైట్ గయ్స్ ఇక్కడ నైట్ టైమ్... లవ్లీ స్లీప్' అంటూ అభిమానులకు గుడ్ నైట్ చెప్పాడు.
ఈ ఫోటోను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఫోటోలో ధావన్‌కి పోలికలే లేవు. దీంతో ధావన్‌కి ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే సెల్ఫీకి ఫిల్టర్ యాడ్ చేయడం వల్ల ఫోటో అలా అయిందని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్ వెస్టిండిస్ పర్యటనలో గత రెండు మ్యాచ్‌ల్లో 2, 5 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశకు గురి చేశాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ సిరిస్‌లో ఆఖరి వన్డే జులై 6 (గురువారం) కింగ్ స్టన్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తుంటే, విండిస్ మాత్రం సిరిస్‌ను సమం చేయాలని చూస్తోంది.