నేనెక్కడున్నానో గుర్తు పట్టండి: పంత్

న్యూఢిల్లీ: భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో కొనసాగుతూ.. వరుస అవకాశాల్ని చేజిక్కించుకుంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 92, 92 పరుగులతో రెండుసార్లూ శతకాల్ని చేజార్చుకున్నా.. అతని ఆటకి భారత సెలక్టర్లు ఫిదా అయ్యారు. దీంతో.. వెస్టిండీస్‌తో ఈనెల 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లోనూ తొలి రెండు వన్డేలకీ అతనికి జట్టులో అవకాశం కల్పించారు.

న్డే సిరీస్‌లోనూ చోటు దక్కించుకున్న పంత్
ఇలా టెస్టు క్రికెట్‌లో 21 ఏళ్ల వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. విండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లో సిరీస్‌లో పంత్ రెండు హాఫ్ సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిభతోనే అతడికి వన్డే సిరీస్‌లోనూ చోటు లభించింది. నూతనోత్సాహంలో ఉన్న పంత్ నెటిజన్లకు ఓ పరీక్ష పెట్టాడు. తాజాగా ట్విటర్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసిన అతడు... అందులో తాను ఎక్కడున్నాడో కనుక్కోమని సవాలు విసిరాడు.
నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్న పంత్
వన్డే సిరీస్ కోసం ప్రస్తుతం నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్న రిషబ్ పంత్.. తాను స్కూల్‌డేస్‌లో క్రికెట్ ఆడుతున్నప్పుడు టీమ్‌తో కలిసి తీసుకున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. ఈ టీమ్‌లో తనని కనిపెట్టాల్సిందిగా అభిమానులకి సరదా పరీక్ష పెట్టాడు.

స్కూల్ స్థాయిలో ఆడిన క్రికెట్ జట్టుతో
రిషబ్‌ను కనుక్కోవడం పెద్ద సవాలేంటి.. అనుకుంటున్నారా..? ఆయన పోస్ట్ చేసింది తన చిన్నప్పటి ఫోటో. అందులో తాను స్కూల్ స్థాయిలో ఆడిన క్రికెట్ జట్టుతో కలిసి దిగిన చిత్రాన్ని పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన అఫ్గానిస్థాన్ క్రికెట్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ఆ ఫోటోలో రిషభ్ ఉన్న ప్రాంతాన్ని క్రాప్ చేసి రీ ట్వీట్ చేశాడు.

రెండు టెస్టుల్లోనూ వరుసగా 92
21 ఏళ్ల ఈ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్.. టెస్టు క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. ఆడిన ఎనిమిది టెస్టుల్లో ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలు సాధించి సత్తా చాటాడు. విండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ వరుసగా 92 పరుగుల వద్ద ఔటై శతకాలను చేజార్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications