తన సస్పెన్స్ ట్వీట్ గుట్టు విప్పిన సౌరవ్ గంగూలీ.. రాజకీయాలు కాదు, రాజీనామా కాదు, అసలు విషయమేంటంటే?

క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నిన్న స్పష్టత లేకుండా ఓ ట్వీట్ చేయడం సంచలనమైంది. బీసీసీఐ అధ్యక్ష పదవి విషయాన్ని ప్రస్తావించిన గంగూలీ.. ఇకపై ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇక ఈరోజు గంగూలీ మరో సస్పెన్స్ ట్వీట్ చేశాడు. ఇండియాలోనే సరికొత్త ఆవిష్కరణను ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే అది ఎడ్యకేషనల్ యాప్ కాదని స్పష్టం చేశాడు. అసలింతకు దాదా ఏం చెప్తాడా అని అభిమానులు ఎదురుచూశారు.
ఇక 12గంటలకు చెప్తానన్న ముచ్చట లేటుగా రివీల్ చేశాడు. ఈ సస్పెన్స్ వల్ల గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ.. రాజ్యసభకు వెళ్లబోతున్నాడంటూ ఊహాగానాలు రాగా.. అవన్నీ ఉత్త ముచ్చట్లే అయ్యాయి. ఇక ఇంతకీ ఆ సస్పెన్స్ ఏంటంటే.. 'క్లాస్ ప్లస్' అనే ఓ యాప్ ప్రమోషన్లో భాగంగా గంగూలీ ఈ సస్పెన్స్ ట్వీట్లు చేశాడు. ఆ యాప్ ప్రమోషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ వ్యవహరిస్తున్నాడు. అందువల్ల యాప్ మీద బజ్ క్రియేట్ చేయడానికే గంగూలీ ఇలా అందరినీ ఆగమాగం చేశాడు.
ఇకపోతే క్లాస్ ప్లస్ యాప్ ద్వారా కోచ్‌లు, ఎడ్యుకేటర్లు, కాంటెంట్ క్రియేటర్లు తమ స్కిల్స్ ఉపయోగించి.. డబ్బులు సంపాదించుకునే అవకాశాలు లభిస్తాయి. నేర్చుకోవాలనుకున్న వారికి సరైన గైడెన్స్ ఒక్క చోట దొరికేలా ఈ యాప్ డిజైన్ చేశారు. ఇక గంగూలీ దీన్ని కాస్త హైలెట్ చేసేందుకు కాస్త డిఫరెంట్ స్టైల్లో ప్రయత్నించాడు.
ఇకపోతే నిన్నటి ట్వీట్‌లో దాదా స్పందిస్తూ.. 'భారత క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన 1992 నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న 2022 వరకు నా క్రికెట్ ప్రయాణం గొప్పగా సాగింది. ఈ క్రికెట్ జీవితంలో నాకు కావాల్సినవన్నీ ఇచ్చింది. ముఖ్యంగా నాకు లభించిన మద్దతు వెల కట్టలేనిది. నా ప్రయాణంలో భాగమై అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు.
వారి సహాయ సహకారాల వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఈ రోజు నేను ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. భవిష్యత్తులో కూడా తనకు ఈ తరహా మద్దతే లభిస్తుందని ఆశిస్తున్నాను'అని దాదా సుదీర్ఘ ట్వీట్ చేయడంతో అంతా బీసీసీఐ పదవికి దాదా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్తాడని భావించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications