ఇదే చివరి పర్యటన: సఫారీ గడ్డపై ధోని ఓ వెలుగు వెలిగాడు
హైదరాబాద్: సఫారీ గడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎంతో ప్రత్యేకం. కెప్టెన్‌గా ధోని తన తొలి ఐసీసీ ట్రోఫీని గెలిచించి ఇక్కడే కాబట్టి. 2007లో ధోని నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ వరల్డ్ టీ20ని సొంతం చేసుకుంది. 36 ఏళ్ల ధోని ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. సఫారీ గడ్డపై ఇదే ధోని చివరి పర్యటన కావొచ్చు. ఫిబ్రవరి 1 నుంచి సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆరు వన్డేల సిరిస్‌తో పాటు ముూడు టీ20ల సిరిస్ ఆడనుంది. 2014లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని, 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

ధోనికి ఇదే చివరి సఫారీ పర్యటన
ప్రస్తుతం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరిస్ జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ డిసెంబర్ 2019 వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్ జరగకపోవచ్చు. సఫారీ గడ్డపై టీమిండియా మళ్లీ 2020లో అడుగుపెట్టొచ్చు. అప్పటివరకు జట్టులో ధోని ఉంటాడన్న నమ్మకం లేదు. దీంతో ధోనికి ఇదే చివరి సఫారీ పర్యటన అవుతుంది. డిసెంబర్ 1, 2006లో ఇదే సఫారీ గడ్డపై అంతర్జాతీయ టీ20ల్లో ధోని అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో ధోని డకౌట్‌గా వెనుదిరిగాడు. జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సెప్టెంబర్, 2007 ధోని కెరీర్ పూర్తిగా మారిపోయింది.

ఫైనల్లో పాక్‌పై ఘన విజయం
దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన తొలి ఐసీసీ వరల్డ్ టీ20 ట్రోఫీని ధోని నేతృత్వంలోని టీమిండియా కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 24, 2007లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఇది భారత టీ20 క్రికెట్‌లో పెనుమార్పులకు మూలమైంది. ఆ తర్వాత ఏడాది 2008లో భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభమైంది. ఆ తర్వాత ధోని నేతృత్వంలోని టీమిండియా ఎన్నో అద్భుతాలు చేసింది. 2011 వరల్డ్ కప్‌తో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐసీసీ నిర్వహించే మూడు ట్రోఫీలను నెగ్గిన ఏకైక భారత కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు.

2006లో తొలి టెస్టు మ్యాచ్
సఫారీ గడ్డపై టీమిండియా 2006లో తొలి టెస్టు మ్యాచ్ నెగ్గింది. ఈ టెస్టు మ్యాచ్‌లో ధోని సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 2010లో ధోని నేతృత్వంలోని టీమిండియా డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీంతో సఫారీ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గిన కెప్టెన్లలో రాహుల్ ద్రవిడ్ తర్వాత ధోని నిలిచాడు. ఇక, ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా కూడా ఓ టెస్టు మ్యాచ్ నెగ్గింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సఫారీ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ కూడా చేరిపోయాడు.

అత్యుత్తమ కెప్టెన్లో ధోని ఒకడు
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత క్రికెట్ అందించిన అత్యుత్తమ కెప్టెన్లో ధోని ఒకడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి గైడెన్స్ ఇస్తున్నాడు. వన్డేల్లో ధోని మరో మైలురాయికి చేరువయ్యాడు. వన్డేల్లో పదివేల పరుగుల చేయడానికి గాను ధోనికి 102 పరుగులు అవసరం. ఈ అరుదైన ఘనతను ధోని సఫారీ గడ్డపై అందుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు.
MS Dhoni's international career numbers:
Tests: 90 matches, 4,876 runs, 6 100s, 33 50s
ODIs: 312, 9,898 runs, 10 tons, 67 fifties
T20Is: 86, 1,364 runs, 1 fifty
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications