Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR: జర్నలిస్ట్‌ పరువు తీసిన హిట్టర్లు.. నవ్వులే నవ్వులు (Video)

రెండు నెలల పాటు వినోదాన్ని పంచిన ఐపీఎల్-2024 ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది.
పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ట్రోఫీని ముద్దాడింది. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గి టైటిల్ అందుకుంది. కోల్‌కతాకు ఇది మూడో ట్రోఫీ. 2012, 2014 సీజన్‌లోనూ కేకేఆర్ కప్‌ను అందుకుంది.

టైటిల్ సాధించిన అనంతరం కేకేఆర్ సంబరాలు వైరల్‌గా మారాయి. హర్షిత్ రాణా ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్స్‌తో కోల్‌కతా ఆటగాళ్లు ఫొటోలకు ఫోజులివ్వడం, ఫిపా ప్రపంచకప్ గెలిచిన తర్వాత లియోనల్ మెస్సీ చేసిన సంబరాల స్టైల్‌ను శ్రేయస్ అయ్యర్ అనుకరించడం, రింకూ సింగ్ ఫన్నీ ఇంగ్లిష్ స్పీచ్‌, సునిల్ నరైన్ నవ్వడం.. ఇలా ఎన్నో మధరుక్షణాలు చోటు చేసుకున్నాయి.

Final match you perform what happening - KKR players trolled journalist Video surfaces

అయితే కప్ అందుకున్న అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఓ ఫన్నీ ఇంటర్వ్యూ నవ్వులు పూయించింది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో కేకేఆర్ ప్లేయర్లు సునీల్ నరైన్, రసెల్ నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయారు. అసలేం జరిగిందంటే.. ఇంటర్వ్యూలో భాగంగా నరైన్, రసెల్‌ను ఓ ప్రశ్న అడిగారు. 'లాస్ట్ క్వశ్చన్.. ఫైనల్ మ్యాచ్ యూ పర్ఫార్మ్ వాట్ హ్యాపనింగ్?' అని అడగ్గా వెస్టిండీస్ హిట్టర్లు విరగబడి నవ్వేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్లకు ఆ క్వశ్చన్ హిస్టరీ తెలిసే ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఓ బంగ్లా జర్నలిస్ట్.. నరైన్, రసెల్, మొయిన్ అలీ దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్న అడిగాడు. అర్థంకానీ అసంపూర్ణంగా ఉన్న ఈ ప్రశ్నను మొయిన్ అలీ కష్టపడి అర్థం చేసుకుని సమాధానమిచ్చాడు.

కానీ రసెల్ మాత్రం చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. అసలు దాని అర్థం ఏంటని అన్నాడు. ఇంగ్లిష్ రాకపోవడంతో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో పాక్ జర్నలిస్ట్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. మొత్తంగా 'సాటిస్‌ఫైడ్' (సంతృప్తి చెందారా) అని అడిగి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో నెట్టింటిని ఇప్పటికే షేక్ చేస్తోంది. మీమ్స్‌లో తెగ పాపులర్ అయ్యింది. దాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ పరోక్షంగా గుర్తు చేస్తూ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

Story first published: Tuesday, May 28, 2024, 11:04 [IST]
Other articles published on May 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+