IPL 2025 Rajasthan Royals : ఐపీఎల్ 2025 రాజస్థాన్ రాయల్స్ జట్టులో అంతర్గత పోరు మొదలైందని తెలుస్తోంది! ఆ జట్టులోని యువ ఆటగాళ్ల మధ్య పోరు మొదలైనట్లు సమాచారం. ముఖ్యంగా రియాన్ పరాగ్ - యశస్వి జైశ్వాల్ పోటీ పడుతున్నట్లు అనుమానం తలెత్తుతోంది. ఇంతకీ అసలు గొడవ ఏంటంటే?
ఒకరు వెళ్లగానే మరొకడు..
సూపర్ ఓవర్‌కు దారీ తీసిన గత మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఓడింది. ఈ మ్యాచు సూపర్ ఓవర్ లో సంజూ శాంసన్ గాయం కారణంగా ఫీల్డింగ్ కు దిగలేదు. దీంతో వైస్ కెప్టెన్ రియాన్ పరాగ్ రంగంలోకి దిగాడు. ఆ సమయంలో అతడు బౌలర్లతో ఏదో సంభాషణ జరిపాడు. రియాన్ పరాగ్ వెళ్లగానే.. ఆ వెంటనే జైశ్వాల్ కూడా వెళ్లి బౌలర్లతో ఏదో సంభాషణలు జరిపాడు. ఇదే కంటిన్యూగా సాగింది. ఈ కారణంగానే కొత్త అనుమానాలు తలెత్తాయి.

బహిరంగంగానే చెప్పాడు...
రియాన్ పరాగ్ ఇప్పటికే తొలి మూడు మ్యాచుల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. పైగా అతడు వైస్ కెప్టెన్ కూడా. మరి ఇలాంటి స్థితిలో జైశ్వాల్ అనవసరంగా కెప్టెన్సీ విషయంలో దూరుతున్నట్టుగా క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే అతడు రీసెంట్‌గానే దేశవాళీ క్రికెట్‌లోనూ ముంబయి జట్టు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. గోవా జట్టు కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వడంతో తాను జట్టు వీడినట్లు బహిరంగంగానే చెప్పాడు.
నిరూపించుకునేందుకు...
అంటే జైశ్వాల్ కెప్టెన్సీ ఆశిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమైంది. ఇక టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ రేసులోనూ అతడు పోటీ పడుతున్నట్టుగా ఆ మధ్య ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే ఇప్పుడతడు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా నిరూపించుకోవాలని అనుకుంటున్నాడేమోనని అంతా అనుకుంటున్నారు. రాజస్థాన్ జట్టులో సారథ్య బాధ్యతల కోసం ఆశిస్తున్నాడేమోనని అంతా భావిస్తున్నారు. కాబట్టి రియాన్ పరాగ్ తో పోటీ పడుతూ.. రాజస్థాన్ కెప్టెన్సీకి సంబంధించిన విషయాల్లో దూరుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే.