Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ మ్యాచ్.. స్టేడియంలో పిడిగుద్దులతో కొట్టుకున్న లవర్స్!!

IPL 2025: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ - దిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ 12 పరుగులు తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ హీరో కరుణ్ నాయర్ - ముంబయి ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మధ్య జరిగిన వివాదం హాట్ టాపిక్ మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు.. ఇదే మ్యాచులో దారుణంగా కొట్టుకున్న ఓ అబ్బాయి - అమ్మాయికి సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ దారుణమైన ఫైటింగ్ చూసి క్రికెట్ అభిమానులు షాక్ కు గురౌతున్నారు.

పిడిగుద్దులు, చెంపదెబ్బలు..
ఈ వీడియోలో.. స్టాండ్స్ లో ఉన్న ఓ యువతి, యువకుడు అతి దారుణంగా కొట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ పరస్పర పిడిగుద్దులతో ఘోరంగా కొట్లాడుకున్నారు. ఒకరిపై మరొకరు పడిపోతూ.. ముఖాలపై చెంపదెబ్బలు, పిడిగుద్దులతో రెచ్చిపోయారు. వెంటనే పక్కనున్నవారంతా కలగజేసుకుని, వారిని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. సెక్యురిటీ సిబ్బంది కూడా వారిని ఆపేందుకు చాలా ట్రై చేశారు. కానీ వారు కొట్టుకోవడాన్ని మాత్రం అస్సలు ఆపలేదు. మరి ఈ గొడవకు అసలు కారణమేంటో తెలియలేదు.

ఇది ఢిల్లీ బాస్..
ప్రస్తుతం ఈ దారుణమైన ఫైటింగ్ వీడియో.. సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. మరి వీరిద్దరు లవర్సా లేదా స్ట్రేంజర్సా .. అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది పక్కాగా తెలియలేదు. ఇది చూసిన నెటిజన్లు మాత్రం.. 'ఢిల్లీలో ఇది కామన్' అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Fight Between Girl and Boy in MI vs DC match IPL 2025 at Arun Jaitley Stadium
Photo Credit: twitter screenshot
Story first published: Monday, April 14, 2025, 16:26 [IST]
Other articles published on Apr 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+