For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనీష్ సెంచరీ: గెలుపు, భారత్‌కు పరువు దక్కింది

By Pratap

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో చివరకు భారత్ పరువు దక్కించుకుంది. ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 331 పరుగుల లక్ష్యాన్ని నాలుగో వన్డేలో శనివారం ఛేదించి విజయాన్ని దక్కించుకుంది. క్లీన్ స్వీప్ కాకుండా పరువు కాపాడుకుంది. సిరీస్‌ను మాత్రం 1-4 స్కోరుతో ఆస్ట్రేలియాపై కోల్పోయింది. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.

మనీష్ పాండే 84 బంతుల్లో 104 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ ధోనీ 34 పరుగులు చేసి మార్ష్ బౌలింగులో అవుటయ్యాడు. భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాస్టింగ్స్ 3 వికెట్లు తీయగా, మార్ష్‌కు ఒక్క వికెట్ లభించింది. విరాట్ కోహ్లీ మినహా టాప్ ఆర్డర్ నిలదొక్కుకుని ఆడడంతో విజయం దక్కింది.

ఆస్ట్రేలియా తన ముందు ఉంచిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 123 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ 78 పరుగులు చేసి హాస్టింగ్స్ బౌలింగులో వెనుదిరిగాడు. నాలుగో వన్డేలో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఐదో వన్డేలో శనివారం చాలా తక్కువ పరుగులకే అవుటయ్యాడు. 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో భారత్ 134 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

Fifth oneday: Australia steady after Finch dismissal

మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ సెంచరీలతో భారత్‌పై ఐదో వన్డేలో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. విజయానికి భారత్ 331 పరుగులు చేయాల్సి ఉంటుంది. మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అంతకు ముందు పౌల్కనర్ ఒక్క పరుగు మాత్రమే చేసి బుమ్రాహ్ బౌలింగులో ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, బుమ్రాహ్ రెండేసి వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, రిషి ధావన్‌లకు తలో వికెట్ దక్కింది.

భారత్‌పై జరుగుతున్న ఐదోది చివరిదీ అయిన వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ ఆరు పరుగుల మాత్రమే చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. ఒక్క పరుగుతో రోహిత్ శర్మ సెంచరీ మిస్సయ్యాడు. 99 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద అతను ఔటయ్యాడు. దీంతో భారత్ 231 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

అస్ట్రేలియా 78 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. జార్జ్ బెయిలీ ఆరు పరుగులు మాత్రమే చేసి రిషీ ధావన్ బౌలింగులో వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా 117 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మార్ష్ రన్నవుటయ్యాడు.

ఆ తర్వాత 64 పరుగుల వద్ద స్మిత్ 26 పరుగుల చేసి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. స్మిత్ వికెట్‌ను బుమ్రావ్ తీశాడు. వన్డేలోకి అడుగు పెట్టిన జస్‌ప్రీత్ బుమ్రాహ్ వికెట్ తీసి శుభారంభం చేశాడు. అంతకు ముందు టాస్ గెలిచి ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అస్ట్రేలియా 235 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 122 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు.

Fifth oneday: Australia steady after Finch dismissal

అస్ట్రేలియా 320 పరుగుల పద్ద ఆరో వికెట్ కోల్పోయింది. వాడే 36 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో అంతర్జాతీయ వన్డేలో ప్రవేశించిన నాలుగో భారత ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రాహ్. అంతకు ముందు బరీందర్ శ్రాన్, గుర్‌కీరత్ సింగ్ మన్, రిషీ ధావన్ ఈ సిరీస్‌లో అంతర్జాతీయ వన్డేలో అడుగు పెట్టారు.

మొహమ్మద్ షమీ గాయపడడంతో బుమ్రాహ్‌కు భారత జట్టులో స్థానం లభించింది. అతను ట్వంటీ20 జట్టులో కూడా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో బుమ్రాహ్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా దూరమైన అజింక్యా రహనే స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+