Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదో వన్డే: కోహ్లీ తర్వాత పాక్‌పై వార్నర్ రికార్డుల మోత

హైదరాబాద్: పాకిస్థాన్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరిస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. అడిలైడ్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ 128 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు సాధించి తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు.

డేవిడ్ వార్నర్‌కి ఇది 13వ సెంచరీ. మరో ఓపెనర్ ట్రావిడ్ హెడ్ 137 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 128 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 284 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆస్ట్రేలియా జట్టుకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

తాజా ఇన్నింగ్స్‌తో ఐదుసార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఓపెనర్లు స్వైర విహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంది.

Fifth ODI: David Warner goes large as records fall

మరో ఓపెనర్ ట్రావిడ్ హెడ్ ధాటిగా ఆడటంతో 41 ఓవర్ల పాటు పాక్ జట్టు వికెట్ పడగొట్టలేకపోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్‌కి ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. కాగా, పాకిస్థాన్‌పై 2012లో మీర్పూర్‌లో 183 పరుగులు చేసిన కెప్టెన్ కోహ్లీ తర్వాత వార్నరే (179) ఆ జట్టుపై ఎక్కువ స్కోరు చేశాడు.

ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు
* దక్షిణాఫ్రికా ఆటగాడు హాషీమ్‌ ఆమ్లా 83, విరాట్‌ కోహ్లీ 86 వన్డే ఇన్నింగుల్లో 13 సెంచరీలు సాధించగా వార్నర్‌ 91 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు.
* ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన సంగక్కర రికార్డును వార్నర్ సమం చేశాడు. 2016-17లో వార్నర్‌, 2014-15లో సంగక్కర ఆరు సెంచరీలు చేశారు.
* ఈ మ్యాచ్‌కు ముందు వరకు డేవిడ్‌ వార్నర్‌ అత్యధిక స్కోరు 178. 2015 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్‌పై ఈ పరుగులు చేశాడు.
* ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్‌ 3-1తో ఇప్పటికే కైవసం చేసుకొంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+