Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫస్ట్ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్లేయర్: మీమ్స్ చూసి లొల్లి పెట్టిన ప్రెసిడెంట్! (వీడియో)

బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు నెయ్‌మార్ జూనియర్ చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా తాజాగా నెయ్‌మార్‌ను ఉద్దేశించి చేసి ఓ ఫన్నీ కామెంట్ ఇందుకు కారణం. బెలో హారిజోంటేలో జరిగిన ఓ పబ్లిక్ హెల్త్ ఈవెంట్లో పాల్గొన్న అధ్యక్షుడు లూలా డా సిల్వా.. అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు. ఆ సమయంలో ఓ బాలుడు నెయ్‌మార్ బ్రెజిల్ దేశంలోనే అత్యుత్తమ ఆటగాడని చెప్పగా.. అధ్యక్షుడు లూలా డా సిల్వా నవ్వుతూ.. "నెయ్‌మార్ ప్రస్తుతం ఆడటం లేదు.. అతను ప్రపంచంలోనే మొదటి 'వర్క్ ఫ్రమ్ హోమ్' నేషనల్ ప్లేయర్" అంటూ చమత్కరించారు.

ఇంటర్నెట్ మీమ్స్‌పై ప్రెసిడెంట్ కామెంట్స్
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా అక్కడితో ఆగకుండా ఇంటర్నెట్‌లో తాను చూసిన మరికొన్ని జోకులను కూడా పంచుకున్నారు. "నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జోక్‌ను ఇంటర్నెట్‌లో చూశాను. బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు పరిస్థితి చూస్తుంటే.. భవిష్యత్తులో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో 11 మంది 'పీలే'లను సృష్టించి ఓ టీమ్‌ను తయారు చేయాలేమో" అంటూ నవ్వులు పూయించారు. అధ్యక్షుడు చేసిన ఈ కామెంట్స్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

FIFA World Cup 2026 Neymar Called First Work From Home Player as Brazil President Joke Goes Viral

నెయ్‌మార్‌కు గాయం.. జట్టుకు దూరం
ప్రస్తుతం 34 ఏళ్ల నెయ్‌మార్‌ జూనియర్ కుడి పిక్క గాయంతో బాధపడుతున్నాడు. గత మే 17న తన క్లబ్ 'శాంటోస్ ఎఫ్‌సి' తరఫున ఆడుతున్నప్పుడు అతనికి ఈ గాయమైంది. దీనివల్ల ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్‌లో బ్రెజిల్ ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లకు అతను దూరం కావాల్సి వచ్చింది. నెయ్‌మార్ లేకపోయినప్పటికీ బ్రెజిల్ జట్టు మొరాకోతో 1-1తో డ్రా చేసుకోగా.. హైతీపై 3-0తో ఘన విజయం సాధించి నాకౌట్ దిశగా అడుగులు వేసింది.

స్కాట్రాండ్‌తో మ్యాచ్ ద్వారా రీఎంట్రీ?
బ్రెజిల్ అభిమానులకు ఇదొక చేదు వార్త అయినప్పటికీ.. త్వరలోనే నెయ్‌మార్‌ స్టేడియంలోకి అడుగుపెట్టబోతున్నడనే శుభవార్త కూడా అందింది. బ్రెజిల్ ప్రధాన కోచ్ కార్లో అన్సెలొట్టి అందించిన సమాచారం ప్రకారం.. స్కాట్లాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో నెయ్‌మార్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ నెయ్‌మార్ గనుక మైదానంలోకి దిగితే.. అది కేవలం ఒక ఆటగాడి రీఎంట్రీ మాత్రమే కాదు.. బ్రెజిల్ జట్టుకు ఓ పెద్ద మ్యాచ్ విన్నర్ దొరికినట్లే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రికార్డుల వీరుడి ఆఖరి ప్రపంచకప్ కల
ఫుట్‌బాల్ చరిత్రలో నెయ్‌మార్ బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నెయ్‌మార్ ఇప్పటివరకు 128 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 79 గోల్స్ చేసి, దిగ్గజ ఆటగాడు పీలే రికార్డును బద్దలు కొట్టాడు. 2014, 2018, 2022లలో ప్రపంచకప్ ఆడిన నెయ్‌మార్‌కు ఇది నాలుగో, బహుశా ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు. ఇప్పటివరకు తన దేశానికి ప్రపంచకప్ అందించలేకపోయిన నెయ్‌మార్.. ఈ 2026 టోర్నమెంట్‌లో ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు.

Story first published: Sunday, June 21, 2026, 16:51 [IST]
Other articles published on Jun 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+