Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'హిందూ-ముస్లిం గొడవలు ఆపి.. ఆట మీద దృష్టి పెట్టండి'

Harbajan Singh Talks About Social Issues
 FIFA World Cup 2018: Harbhajan Singh asks Indians to stop ‘playing Hindu Muslim’, learn from Croatia

హైదరాబాద్: క్రికెట్ కంటే సామాజిక విషయాలపైనే భజ్జీ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. భారతీయులు హిందూ-ముస్లిం అంటూ గొడవలు పడొద్దని సూచిస్తున్నాడు. ఈ గొడవలను పక్కన పెట్టి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాను చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. ఫ్రాన్స్‌-క్రొయేషియా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు బజ్జీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఆ టీమ్ ఇంత వరకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫైనల్లోనూ ఫ్రాన్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఓ ఓన్ గోల్ ఫైనల్లో వాళ్ల కొంప ముంచినా.. ఓవరాల్‌గా క్రొయేషియా ఆట అదుర్స్ అనిపించే ఉంది. ఈ గేమ్‌కు ముందే ట్వీట్ చేసిన భజ్జీ..

ఈ అంశాన్ని ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ ఆడిన క్రొయేషియా టీమ్‌ను ఉదాహరణగా తీసుకొని చెప్పాడు. 50 లక్షల జనాభా కూడా లేని క్రొయేషియా వరల్డ్‌కప్ ఫైనల్ ఆడుతున్నది.. మనం 135 కోట్ల మంది ఇండియన్స్ హిందూ, ముస్లిం ఆట ఆడుతున్నాం.. ముందు ఆలోచన మార్చుకోండి.. దేశం మారుతుంది అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. సోచ్ బద్‌లో దేశ్ బద్‌లేగా హ్యాష్‌ట్యాగ్‌ను హర్భజన్‌సింగ్ ఈ ట్వీట్‌లో పోస్ట్ చేశాడు.

ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇక ఫిఫా తుది సమరంలో సంచలనాల క్రొయేషియా పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా గెలిచి చూపించింది. ఇది ఫ్రాన్స్ జట్టకు రెండో ప్రపంచ కప్.

Story first published: Monday, July 16, 2018, 16:53 [IST]
Other articles published on Jul 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+