యువరాజ్ బౌలింగ్‌పై ధోని, వేరువేరు... యువీతో సురేష్ రైనాని పోల్చవద్దు
2011 వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్ ధోని సేన ఛాంపియన్‌గా అవతరించడానికి కీలక పాత్ర పోషించిన వారిలో యువరాజ్ సింగ్ ఒకడు. 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డును అందుకున్న యువరాజ్ సింగ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ముఖ్యంగా 2011 వరల్డ్ కప్‌లో టోర్నమెంట్ మొత్తం యువరాజ్ సింగ్ 15 వికెట్లు తీశాడు. ఐతే, ప్రస్తుతం ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ కప్ కొత్త నిబంధనలు యువరాజ్ సింగ్ బౌలింగ్‌పై ప్రభావం చూపేదన్నారు.
ప్రస్తుత వరల్డ్ కప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఫీల్డింగ్ నిబంధన(30 అడుగుల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి) ప్రకారం యువరాజ్ సింగ్ ఎక్కువగా బౌలింగ్ వేసే అవకాశం వచ్చి ఉండేది కాదన్నారు. టీ20ల్లో రెగ్యులర్‌గా బౌలింగ్ వేస్తున్నా, ఈ కొత్త నిబంధన అతని బౌలింగ్‌పై ప్రభావం చూపుతుందన్నారు.
వరల్డ్ కప్‌లో యువరాజ్ స్ధానాన్ని సురేష్ రైనా భర్తీ చేస్తాడని చెప్పుకొచ్చాడు. గతంలో ఉన్న ఫీల్డింగ్ నిబంధనలు గురించి పెద్దగా ఆలోచించని ధోని, మ్యాచ్ కీలక సమయాల్లో ఉన్నప్పుడు పార్ట్ టైమ్ బౌలర్స్ అయిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను కూడా ఉపయోగించిన సందర్భాలున్నాయి.

లెప్ట్ హ్యాండర్స్ బ్యాట్స్ మెన్స్‌కు సురేష్ రైనా చక్కగా బౌలింగ్ చేయగలుగుతాడని, ఉదాహరణకు ఐర్లాండ్ గేమ్‌లో అతని బౌలింగ్ అవసరం ఉందని అతనితో బౌలింగ్ వేయించానన్నారు. పరిస్ధితులను బట్టి శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను కూడా అదే మ్యాచ్‌లో వినియోగించానన్నారు.
యువరాజ్ సింగ్‌తో సురేష్ రైనా బ్యాటింగ్ ప్రదర్శనపై కూడా గురించి ధోని ప్రస్తావించాడు. యువరాజ్ సింగ్ తన కెరీర్‌ను నెం.5 బ్యాట్స్‌మెన్‌గా ఆరంభించాడు. అయితే 2005 తర్వాత నెం.4వ స్ధానంలో ఆడటం మొదలుపెట్టాడు.
తాను నెం.4 స్ధానంలో ఆడుతున్న సమయంలో నెం.5వ స్ధానంలో మహ్మాద్ కైఫ్ బ్యాటింగ్ చేశావాడని అన్నారు. ఇప్పుడు సురేష్ రైనా నెం.5వ స్ధానంలో కీలకమైన ఆటగాడిగా ఉన్నారు. దీనిని బట్టి ఇద్దరి ఆటతీరుని పోలిక చేయకూడదన్నారు. కారణం యువరాజ్ సింగ్, సురేష్ రైనా ఆడే స్ధానాలు వేరువేరుని అన్నాడు.
గత వరల్డ్ కప్‌లో ఆడిన యువరాజ్ సింగ్, డ్వేన్ బ్రేవోలకు 2015 వరల్డ్ కప్‌లో చోటు లభించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఆల్ రౌండర్స్‌కు 30 లేదా 35వ ఓవర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. అలాంటి సందర్భంలో ఆల్ రౌండర్లు 50 వరకు పరుగులు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి అవకాశమే ఈ వరల్డ్ కప్‌లో రాలేదని ధోని స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications