Shubman Gill: డేటింగ్, రిలేషన్ షిప్, పెళ్లి, గొడవ.. వ్యవహారం ఏదైనా టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ పేరు మాత్రం తరచు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. మొన్నటి వరకు డేటింగ్, పెళ్లి వంటి విషయలతో వార్తల్లో నిలిచిన అతడు.. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో అంపైర్ తో గొడవ పడి మరించ చర్చనీయాంశంగా మారాడు. ఇప్పుడు అతడిపై ఓ మ్యాచ్ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మరో విషయంతో హాట్ టాపిక్ గా మారాడు గిల్. అందుకు కారణం.. అందాల భామ ఫెమినా మిస్ ఇండియా 2023 నందిని గుప్తా అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే. అతడిని ఉద్దేశిస్తూ తన మనసులోని మాటలను బయటపెట్టింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?
శుభమన్ గిల్ తన క్లాస్ పర్ఫార్మెన్స్‌తో క్రికెట్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పలు రికార్డులు సాధించిన అతడు.. ఐపీఎల్ లోనూ అంతే సంచలనంగా మారాడు. 2018లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన అతడు.. గత ఆరేళ్లలో 2020 ననుంచి 2025 వరకు ప్రతీ సీజన్ లోనూ 400కుపైగా స్కోర్ చేస్తూనే వచ్చాడు. ఐపీఎల్ 2020లో 440 పరుగులు, ఐపీఎల్ 2021లో 478 రన్స్, ఐపీఎల్ 2022లో 483 పరుగులు, ఐపీఎల్ 2023లో ఏకంగా 890 పరుగులు, ఐపీఎల్ 2024లో 426 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 465 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు.

ఈ సీజన్ లో తొలి కెప్టెన్ అతడే..
ఐపీఎల్ 2025లో శుభమన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ మంచి ప్రదర్శ చేస్తూ ప్లేఆఫ్స్ రేసులో గట్టిగానే పోటీనిస్తోంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌లలో ఏడింటిలో గెలిచింది. అయితే ఈ సీజన్‌లో 465 పరుగులు చేసిన అతడు.. 400 రన్స్ కు పైగా పరుగులు చేసిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. కానీ ఇప్పుడతడు సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో అంపైర్ తో గొడవపడి వివాదంలో చిక్కుకున్నాడు.
గిల్ నా ముద్దుల క్రష్..
ఈ సమయంలో అందాల భామ ఫెమినా మిస్ ఇండియా 2023 నందిని గుప్తా గిల్ పై తన అభిమానాన్ని చాటుకుంది. క్రికెట్ లో గిల్ ఓ అద్భుతమైన క్రికెటర్ అని పేర్కొంది. "గిల్ నా క్రికెట్ క్రష్. నా ఫేవరెట్ క్రికెటర్. అతడు సూపర్" అంటూ కామెంట్స్ చేసింది. అసలే ఈ మధ్య గిల్ డేటింగ్, పెళ్లి వార్తలు జోరుగా వస్తున్నాయి. అతడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నందిని గుప్తా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.