Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పురుషుల మ్యాచ్‌పై బెట్టింగ్, మహిళా క్రికెటర్‌పై బ్యాన్

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మహిళా క్రికెటర్ ఒకరు పురుషుల క్రికెట్ మ్యాచ్ పైన బెట్టింగ్‌కు పాల్పడిన ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైంది. ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచు పైన ఆమె బెట్టింగ్‌కు పాల్పడింది. దీంతో ఆరు నెలల పాటు ఆమెను బ్యాన్ చేశారు.

ఆమె పేరు పీపా క్లీయారీ. వయస్సు 19 ఏళ్లు. ఆమె పెర్త్ స్కార్చర్స్ తరఫున ట్వంటీ 20 బిగ్ బాష్ లీగ్‌లో ఉంది. నవంబర్ నెలలో జరిగిన ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మూడో టెస్ట్ పైన 15.50 ఆస్ట్రేలియన్ డాలర్లను బెట్టింగ్ కట్టింది. దీంతో వేటు పడింది.

Female cricketer banned for betting on men's match

ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లు బెట్టింగ్‌కు పాల్పడి బ్యాన్‌కు గురైనవారిలో ఈమె రెండో వ్యక్తి. వీరిద్దరు బెట్టింగ్ పెట్టింది పురుషుల క్రికెట్ మ్యాచ్ పైనే.

అంతకుముందు ఏంజిలా రీక్స్ (సిడ్నీ సిక్సర్స్ జట్టు లెగ్ స్పిన్నర్) బెట్టింగ్‌కు పాల్పడి రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైంది. ఆమె 2019 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ పైన పెట్టింగ్‌కు పాల్పడింది. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ చెప్పారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+