పాంటింగ్ తన బిడ్డలా ఆదరించారు: హార్దిక్ పాండ్యా

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ మాజీ కోచ్ రికీ పాంటింగ్ తనను కొడుకులా ఆదరించారని టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ ఆడటం ఇకపై సవాలేనని, ఇక తాను పొట్టి క్రికెట్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు హార్దిక్ 11 టెస్టులు మాత్రమే ఆడాడు. 2018 సెప్టెంబర్ తర్వాత మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేదు. భారీ షాట్లు ఆడగలిగే సత్తా ఉండటంతో.. పొట్టి క్రికెట్లో మాత్రం కీలక సభ్యుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే.

బిడ్డలా ఆదరించారు
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో జరిగిన సంభాషణ సందర్భంగా హార్దిక్ పాండ్యా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... 'రికీ పాంటింగ్ తన బిడ్డలా ఆదరించారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నా. పరిస్థితులు, మనస్తత్వాల గురించి ఆయన చక్కగా వివరించేవారు. 2015లో కొత్తగా ఉండడంతో.. నేను హోర్డింగ్స్ పక్కన కూర్చునేవాడిని. ఆ సమయంలో రికీ నాతో కూర్చుని ఆట గురించి మాట్లాడేవాడు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు వరకు పక్కనే కూర్చొనేవారు. ఫీల్డింగ్ చేస్తుంటే.. బౌండరీ వద్ద ఉండి రికీని పిలిచి మాట్లాడితే మ్యాచులో ఏం జరుగుతుందో చెప్పేవారు. ఆయన సలహాలతో ఎన్నో విషయాలను త్వరగా నేర్చుకున్నా' అని అన్నాడు.

ఆ ఫార్మాటే ఆడితే రిస్క్ చేయక తప్పదు
'సుదీర్ఘ ఫార్మాట్లో నన్ను బ్యాకప్ పేసర్‌గా భావిస్తారని తెలుసు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత టెస్టు క్రికెట్ ఆడటం సవాలే. ఒకవేళ నేను కేవలం ఆ ఫార్మాటే ఆడేవాడినైతే రిస్క్ చేయక తప్పదు. అయితే తెలుపు బంతి క్రికెట్ ప్రాముఖ్యం నాకు తెలుసు. ఒక సిరీస్‌లో నేను టెస్టు క్రికెట్‌ను ముందుగా ఆడి ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడితే రాణించలేకపోయేవాడిని. టెస్టు ఫార్మాట్, పరిమిత ఓవర్ల క్రికెట్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టమయ్యేది. ఎందుకంటే నాయొక్క ప్లస్ పాయింట్ నా ఎనర్జీనే. ఒక దాంట్లో రాణిస్తే మరొకదాంట్లో పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయేవాడిని' అని హార్దిక్ తెలిపాడు.

10 నిమిషాలు కదల్లేకపోయా:
'నిజాయితీగా చెబుతున్నా. వెన్నునొప్పితో నా కెరీర్ అంతమైందని అనుకున్నా. దాదాపు 10 నిమిషాలు కదల్లేకపోయా. తర్వాతా ఆ నొప్పి నన్ను వదల్లేదు. కొన్ని రోజుల తర్వాత కోలుకోవడం మొదలైంది. గాయం కాకమునుపే విశ్రాంతినివ్వడంతో ఆసియా కప్ ఆఖరిదిగా భావించా' అని హార్దిక్ పాండ్య వివరించాడు. 2016 ఐపీఎల్ బాగా ఆడలేదు, కరణ్ షోతో ఏకాగ్రత చెదిరిందన్నాడు. వివాదం తర్వాత బయటవారి అభిప్రాయాలు వినడంతో ఇబ్బంది పడ్డానని, ఆ తర్వాత నా నియంత్రణలో లేని అంశాలపై దృష్టి సారించొద్దని నిర్ణయించుకున్నా అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications