న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌-2019 ఆడాలని ఉంది కానీ..: డివిలియర్స్‌

ICC Cricket World Cup 2019 : AB De Villiers On Decision To Retire Before World Cup 2019 ! | Oneindia
Felt Cornered: AB De Villiers On Decision To Retire Before World Cup 2019

ప్రపంచకప్‌-2019 ఆడాలని ఉంది, కానీ ఈ విషయం చెబితే విమర్శలపాలౌతానని తెలిసి ఆత్మరక్షణలో పడ్డానని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ పేర్కొన్నారు. గౌరవ్‌ కపూర్‌ నిర్వహించిన 'బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌' కార్యక్రమంలో డివిలియర్స్‌ పాల్గొని తన మనసులోని మాటలు చెప్పాడు.

జట్టు కోసమే ఆడాను:

జట్టు కోసమే ఆడాను:

'రిటైర్మెంట్‌ ఓ సున్నితమైన అంశం. నా రిటైర్మెంట్‌ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవసరమైన మ్యాచుల్లోనే బాగా ఆడతానని.. లేకపోతే ఆడనని మా వాళ్ళే విమర్శలు చేశారు. దీంతో నాపై ఒత్తిడి పెరిగింది. నేనెప్పుడూ నా కోసం ఆడలేదు, జట్టు కోసమే ఆడాను. అయినా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ఆ సమయంలో నా కోసం ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' అని డివిలియర్స్‌ తెలిపారు.

 50 ఏళ్లు దాటిన తర్వాత చెబుతా:

50 ఏళ్లు దాటిన తర్వాత చెబుతా:

'రిటైర్మెంట్‌ వెనుక ఇంకా అనేక కారణాలున్నాయి. అవి చాలా ప్రత్యేకమైనవి. అయితే అవన్ని నాకు 50 ఏళ్లు దాటిన తర్వాత చెబుతా. పదిహేనేళ్లపాటు నేను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాను. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న ఆట. క్రికెట్ ఆడడం అంటే మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢఢంగా ఉండాలి. ఎక్కువకాలం కెప్టెన్‌గా వ్యవహరించడం కూడా ఓ కారణం' అని డివిలియర్స్‌ పేర్కొన్నారు.

ధోనీ ఆడితే.. నేను ఆడతా:

ధోనీ ఆడితే.. నేను ఆడతా:

2023లో జరిగే ప్రపంచకప్‌లో తిరిగి ఆడుతారా? అని గౌరవ్‌ ప్రశ్నించగా.. 'అప్పటికి నాకు 39 ఏళ్లు వస్తాయి. ధోనీ 2023 వరల్డ్‌కప్‌ వరకు తన ఆటను ఇలాగే కొనసాగిస్తే.. కచ్చితంగా నేను కూడా ఆడతాను' అని డివిలియర్స్ సమాధానం ఇచ్చాడు.

డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు:

డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు:

2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150 (64 బంతుల్లో) రికార్డులు డివిలియర్స్ పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్టు స్కోరు (278 నాటౌట్) కూడా డివిలియర్స్ పేరిటే ఉంది.

Story first published: Tuesday, May 21, 2019, 8:39 [IST]
Other articles published on May 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X