న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'Feeling good': మోచేతి గాయంపై స్టీవ్ స్మిత్, నెట్‌లో ప్రాక్టీస్ (వీడియో)

IPL 2019 : Steve Smith Returns To The Nets After Elbow Surgery
Feeling good - Smith back in nets after elbow surgery

హైదరాబాద్: మోచేతి గాయం సర్జరీ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిసారి నెట్ ప్రాక్టీస్‌కు హాజరయ్యాడు. గత జనవరిలో మోచేతి గాయం కారణంగా బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌)నుంచి స్టీవ్ స్మిత్ అర్థాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. తాజాగా మోచేతి సర్జరీ తర్వాత తొలిసారి స్టీవ్ స్మిత్ గురువారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. తన నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ "నా తొలి నెట్ సెషన్, చాలా సంతోషంగా ఉంది. మోచేతి గాయం ఫీలింగ్ బాగుంది" అని కామెంట్ పెట్టాడు.

పృథ్వీ షా ఈజ్ బ్యాక్: ఒంటి చేత్తో సిక్స్ బాదాడు (వీడియో)పృథ్వీ షా ఈజ్ బ్యాక్: ఒంటి చేత్తో సిక్స్ బాదాడు (వీడియో)

మార్చి 29వ తేదీతో ముగియనున్న నిషేధం

మార్చి 29వ తేదీతో ముగియనున్న నిషేధం

గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో బాల్‌ టాంపరింగ్ ఘటనకు పాల్పడిన క్రికెటర్లపై స్టీవ్ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌లపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. వీరిపై విధించిన నిషేధం మార్చి 29వ తేదీతో పూర్తి అవుతుంది. దీంతో అప్పటి నుంచి వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు అర్హులు.

ఐపీఎల్‌ను సన్నాహకంగా

ఐపీఎల్‌ను సన్నాహకంగా

అయితే, వరల్డ్‌కప్‌కు ముందు ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో పాల్గొని దానిని సన్నాహకంగా ఉపయోగించుకోవాలనే గట్టి యత్నంలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ఇందులో భాగంగా నెట్స్‌లో స్టీవ్ స్మిత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన పూర్వపు ఫామ్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు. ఐపీఎల్‌కు స్టీవ్ స్మిత్ అందుబాటులోకి వస్తే రాజస్తాన్‌ రాయల్స్‌ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.

మార్చి 23 నుంచి భారత్‌లో ఐపీఎల్

మార్చి 23 నుంచి భారత్‌లో ఐపీఎల్

డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో స్టీవ్‌స్మిత్‌ని తొలుత వేలంలోకి విడిచిపెట్టాలని రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ భావించింది. అయితే, సుదీర్ఘ చర్చల తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుని టీమ్‌తో అతడిని అట్టిపెట్టుకుంది. మార్చి 23 నుంచి భారత్‌లో ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఇటీవలే ఐపీఎల్ 2019కి సంబంధించిన షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది.

తొలి రెండు వారాల షెడ్యూల్‌ మాత్రమే

తొలి రెండు వారాల షెడ్యూల్‌ మాత్రమే

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది.

Story first published: Friday, March 1, 2019, 13:20 [IST]
Other articles published on Mar 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X