కచ్చితంగా కుంబ్లేకి సారీ చెప్పాలి: 'చేసిందంతా బీసీసీఐ పెద్దలే'
హైదరాబాద్: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరడానికి బీసీసీఐయే కారణమని మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ అన్నారు. కుంబ్లే-కోహ్లీల మధ్య ఏదైతే జరిగిందో అది క్రికెట్‌లో ఆహ్వానించదగ్గ పరిణామం కాదని అన్నారు.
గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి బేడీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదన్న బేడీ ఆయన ఇక్కడ కచ్చితంగా కుంబ్లేకు సారీ చెప్పాల్సి ఉందని అన్నారు.
'ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఆన్ ఫీల్డ్‌లో బాస్ ఎవరు.. ఆఫ్ ఫీల్డ్‌లో బాస్ ఎవరు అనేది ఇక్కడ అనవసరం. వారి శక్తి మేరకు ఇద్దరూ గేమ్ కోసం ఎంతో కష్టపడ్డారు. మనం చిన్న పిల్లలం కాదు. విచక్షణ తెలిసిన పెద్దలం. మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే' అని అన్నారు.
'మరి అలాంటప్పుడు నేను గొప్ప అనే భావన ఎందుకు. కోహ్లీ-కుంబ్లేల వివాదం పెద్దది కావడానికి ఆజ్యం పోసిందే బీసీసీఐనే. లోధా కమిటీ విషయానికి వస్తే బీసీసీఐలో ఎటువంటి అర్హత లేనివారు ఉండటమే సరిగా హ్యాండిల్ చేయలేకపోవడానికి కారణమైంది' అని బేడీ పేర్కొన్నారు.

కుంబ్లేకి సారీ చెప్పాలని అనుకుంటున్నా
'ఈ మొత్తం ఎపిసోడ్‌లో కుంబ్లేకు నేను సారీ చెప్పాలనుకుంటున్నా. అతను వైదొలిగిన తీరు చాలా బాధాకరం. కోచ్‌గా అద్భుత విజయాలనందించిన కుంబ్లేకే ఇలా జరిగితే.. ఆ తర్వాత వచ్చే కోచ్ పరిస్థితి ఏంటి? ఒక ప్రధాన కోచ్ చేత బలవంతంగా షూస్ తీయించింది ఎవరు. బీసీసీఐలోని పెద్దలే కదా' అని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

గంగూలీ వ్యాఖ్యలపై ఇలా
క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న గంగూలీ చెప్పినట్లు బీసీసీఐ కుంబ్లే-కోహ్లీ వివాదాన్ని సరిగా హ్యాండిల్ చేయలేక పోయిందని అన్నాడు. వారిద్దరి మధ్య నెలకొన్న వివాదాన్ని సరిగా హ్యాండిల్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని కూడా ధ్వజమెత్తాడు. 'ఇదంతా ఎవరు చేశారు? దీని నుంచి మీరు దూరంగా వెళ్లలేరు. ఈ తరహా రోత పుట్టించే వివాదంలో మీరు చేతులు కడుక్కోలేరు. ఏ సందేశాన్ని ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు. ఇద్దరు మధ్య చోటు చేసుకున్న విభేదాన్ని పరిష్కరించే తీరు ఇదేనా' అని బేడీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

అది రూమర్ మాత్రమే
ఇక కుంబ్లే-కోహ్లీ ఆరు నెలలుగా మాట్లాడుకోలేదని వచ్చిన వార్తపై కూడా బేడీ స్పందించారు. 'ఇది కేవలం రూమర్ మాత్రమే. ఒకరితో మరొకరు ఆరు నెలలుగా మాట్లాడుకోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. గతేడాదిగా టీమిండియా విజయాల్లో కుంబ్లే పాత్ర ఎంతో ఉంది' అని బేడీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఐపీఎల్‌తో భారత టెస్టు క్రికెట్‌కు నష్టం వాటిల్లుతోందని కూడా అన్నారు.

అది ఫిక్సింగ్‌కు దారి తీస్తుంది
కేవలం టీ20 క్రికెటర్లుగా మారిపోతుండడంతో యువక్రికెటర్లకు టెస్టు క్రికెట్‌కు తగిన బ్యాటింగ్ సామర్థ్యం, ఓపిక లేకుండాపోతోందని అన్నారు. ఇందుకు భవిష్యత్‌లో భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. ఐపీఎల్‌లో రూ.14 కోట్లు పలికిన క్రికెటర్‌తో కలిసి రూ.14 లక్షలు పలికిన క్రికెటర్ డ్రెస్సింగ్ రూంలో ఉంటున్నాడని అన్నారు. దీంతో ఆ క్రికెటర్‌తో సమానంగా సంపాదించాలన్న తలంపు మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి అవినీతికి పాల్పడేందుకు దోహద పడుతోందని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications