For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ కప్ పోటీల్లో యూసుఫ్ పఠాన్ దడదడలాడిస్తాడా?

By Pratap
Yusuf Pathan
ముంబై: ప్రపంచ కప్ పోటీల్లో ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్‌పై ఆశలు ఎక్కువే ఉన్నాయి. ఒంటి చేతితో ఆటను మలుపు తిప్పగల క్రీడాకారుడిగా అతనికి పేరుంది. బ్యాట్స్‌మన్‌గా బౌలర్లపై వీరవిహారం చేయగల సత్తా అతనిది. మైదానం అన్ని వైపులా తన షాట్లతో దడదడలాడించగలడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన దింపితే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లే. అతని దూకుడు, సామర్థ్యం ప్రత్యర్థి జట్ల వెన్నెముకలో చలి పుడుతుంది. బౌలర్లను నిశ్చేష్టులను చేసే ధాటి అతనిది. దక్షిణాఫ్రికాలో అతను చూపిన ప్రదర్శన మరిచిపోలేనిది. గత పది వన్డే మ్యాచుల లెక్కలు చూస్తే యూసుఫ్ పఠాన్ ప్రమాదకరమైన నిలకడైన బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటిన విషయం అర్థమవుతుంది.

బౌలర్‌గా యూసుఫ్ పఠాన్ ప్రత్యర్థి జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ దారి పట్టించడంలో కీలక పాత్ర పోషించగలడు. ఐపియల్‌లో షేన్ వార్న్ పోషించే పాత్రను యూసుఫ్ పఠాన్ వన్డేల్లో ఎల్లవేళలా పోషించగలడనేది అంటారు. ఆశలు పూర్తిగా సన్నగిల్లిన సమయంలో యూసుఫ్ పఠాన్ ఇంకా ఉన్నాడని ఊరించే ఆటగాడు. యాభై ఓవర్ల మ్యాచ్‌లో 115.09తో రెండో అత్యధిక సగటు సాధించిన బ్యాట్స్‌మన్ పఠాన్.

యూసుఫ్ పఠాన్ ఇప్పటి వరకు 45 మ్యాచులు అడి 694 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఇప్పటి వరకు 36 సిక్స్‌లు బాదాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పఠాన్‌ను ఏ విధంగా వాడుకుంటాడనేదే ముఖ్యం. యూసుఫ్ పఠాన్ బ్యాటింగ్‌కు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముగ్ధుడయ్యాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+