Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ ఆటగాడి మతిమరుపు: బ్యాట్ లేకుండా బ్యాటింగ్‌కు (వీడియో)

హైదరాబాద్: క్రికెటర్‌కు బ్యాట్ ఎంతో ముఖ్యం. అయితే ఆస్ట్రేలియా ఆటగాడు ఫవాద్‌ అహ్మద్‌ మాత్రం బ్యాటు లేకుండానే బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే బ్యాట్ లేకుండా మైదానంలోకి వచ్చానని తెలుసుకున్న అతడు మళ్లీ పెవిలియన్‌ వైపు పరుగెత్తాడు.

షెఫీల్‌షీల్డ్‌ టోర్నీలో భాగంగా విక్టోరియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుందీ ఈ ఓ అద్భుతమైన సన్నివేశం. తన మతిమరుపుతో ఫవాద్‌ అహ్మద్‌ కాస్త హాస్యం పుట్టించాడు. కానీ ఓ అంతర్జాతీయ క్రికెటర్ ఇలా బ్యాట్‌ను మరిచిపోయిన మైదానంలోకి రావడం పెద్ద చర్చనీయాంశమైంది.

ఆసీస్ తరుపున మూడు వన్డేలు, రెండు టీ20 ఆడిన ఫవాద్‌ అహ్మద్‌

ఆసీస్ తరుపున మూడు వన్డేలు, రెండు టీ20 ఆడిన ఫవాద్‌ అహ్మద్‌

ఫవాద్‌ అహ్మద్‌ పాకిస్థాన్‌లో పుట్టిన ఆస్ట్రేలియన్ క్రికెటర్. వయసు 35 ఏళ్లు. ఆస్ట్రేలియా తరుపున మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం విక్టోరియా జట్టు తరఫున షెఫీల్‌షీల్డ్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆడుతున్నాడు.

బ్యాట్ లేకుండా క్రీజులోకి

బ్యాట్ లేకుండా క్రీజులోకి

పదకొండో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ఫవాద్ అహ్మాద్ తొమ్మిదో వికెట్‌ పడగానే మైదానంలోకి వచ్చాడు. చేతి గ్లౌజ్‌లు, హెల్మెట్‌, ప్యాడ్స్‌ సరిచేసుకుంటూ క్రీజు వైపు వస్తున్నాడు. ఏమి గుర్తుకు వచ్చిందో ఏమో గానీ చేతిలో బ్యాట్ లేదని తెలిసి ఫవాద్‌ నాలిక కరచుకున్నాడు.

ట్విట్టర్‌లో పోస్టు చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా

అనంతరం వెంటనే వెనక్కి వెళ్లాడు. జట్టు సహచర ఆటగాడు బ్యాట్ అందించడంతో దానిని తీసుకొని క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ ఉదంతం మొత్తాన్ని మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న వెస్ట్రన్ ఆటగాళ్లు చూసి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో అహ్మద్ ఏడు బంతులను ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. విక్టోరియా 322 పరుగులకే ఆలౌటైంది. తొలిరోజు బౌలర్లు మొత్తం 15 వికెట్లు పడగొట్టారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+