Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వలింగ సంపర్కుడిని కాదు: జేమ్స్‌ ఫాల్క్‌నర్‌

Cricketer James Faulkner Says He Is Not G@y After Social Media 'Misunderstanding' || Oneindia Telugu
Faulkner Says He is Not Gay After ‘Misunderstanding’ on Social Media

తాను స్వలింగ సంపర్కుడి(గే)ని కాదు అని ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ స్పష్టం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫాల్క్‌నర్‌ ఈ విషయాన్ని తెలిపాడు. ఇంతకుముందు తాను చేసిన పోస్టును అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

అపార్ధం చేసుకున్నారు:
'గత రాత్రి చేసిన పోస్టును అపార్ధం చేసుకున్నారు. నేను స్వలింగ సంపర్కుడి(గే)ని కాదు. ఏదేమైనా ఎల్బీజీటీ కమ్యూనిటీ మద్దతు అద్భుతం. ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేం. రాబర్ట్‌ జబ్‌ ఎప్పటికీ మంచి ఫ్రెండ్ మాత్రమే. మేము హౌస్ మేట్స్ అని గత రాత్రి పోస్ట్ చేసాను' అని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు.

ఐదేళ్లుగా కలిసుంటున్నాం:
ఆదివారం 29వ పుట్టినరోజు జరుపుకొన్న సందర్భంగా ఫాల్క్‌నర్‌ తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌ రాబర్ట్‌ జబ్‌తో ఐదేళ్లుగా కలిసుంటున్నట్టు తెలిపాడు. అంతేకాదు.. 'నా బాయ్‌ఫ్రెండ్‌ రాబర్ట్‌ జబ్‌తో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్‌' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్‌ చేశాడు. ఇది కాస్తా నెట్టింట్లో వైరల్ కావడంతో ఫాల్క్‌నర్‌ మరో పోస్ట్ ద్వారా తాను స్వలింగ సంపర్కుడిని కాదు అని తెలిపాడు.

తొలి క్రికెటర్‌ డేవిస్‌:
2011లో ఇంగ్లండ్‌కు చెందిన క్రికెటర్‌ స్టీవెన్‌ డేవిస్‌ తాను 'గే'నంటూ చెప్పుకొన్నాడు. ఒక క్రికెటర్‌ ఇలా ప్రకటన చేయడం అదే తొలిసారి. ఇక న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లు ఏకంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. అయితే పేలవ ఫామ్ కారణంగా గత ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కాలేదు.

Story first published: Tuesday, April 30, 2019, 10:24 [IST]
Other articles published on Apr 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+